Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.07.2024
Share:

By Village Missionary Movement

Sunday, 28-Jul-2024

దిన ధ్యానము(Telugu) 28.07.2024

 

అంశం:- పైన ఉన్న వాటిని వెదుకుడి 

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

“పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి” - కొలస్సీయులకు 3:2

 

హలో పిల్లలు అందరూ బాగున్నారా? మీకు ఎదుటివాని యెద్ద నుండి తీసుకొనుట ఇష్టమా లేదా వారికి ఇచ్చుట ఇష్టమా? తీసుకొనుట ఇష్టము అని మీరు చెబుతున్నది నాకు వినపడుతున్నది. మనము ఎదుటివారి సంతోషమును కోరుకొనుట వారి కొరకు ప్రయాసపడుట దేవునికి ఇష్టమైన కార్యము. ఒకరు తమ యొక్క త్యాగం చేత ఏ విధముగా ఒక నగరాన్ని తయారు చేశారు అనేదాన్ని ఈ దినము చూద్దామా.

 

సాయర్ అనే పోర్చుగల్ వ్యాపారవేత్త భారతదేశంలో 1800ల సంవత్సరంలో వ్యాపారము చేస్తూ వచ్చారు. ఈయన యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి. ప్రజలందరికీ యేసయ్య ప్రేమను చెబుతూ ఉంటారు. కష్టపడుతున్న వారికి ఆయన తోచినంత సహాయం చేస్తూ ఉండేవారు. ఇప్పటివరకు చెప్పిన కార్యము 1810వ సంవత్సరంలో జరిగింది. అది ఏమిటి అని ఆలోచిస్తున్నారా? యేసయ్యను అంగీకరించిన వాళ్లను అంటరాని వారిగా ఊరికి దూరంగా ఉంచారు. వారిని హింసించుట, చాలా ఇబ్బందులు పెట్టుట చేసేవారు. అందువలన అంటే కొంతమంది యేసయ్యను తిరస్కరించారు. ఇంకా కొంతమంది వేరే ప్రాంతమునకు వెళ్ళిపోయారు. ఇలా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆ దినాల్లో ఉండేవారు. హలో పిల్లలు ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థించడం మర్చిపోకూడదు.

 

ఈ పరిస్థితిని చూసిన సాయర్ 150 ఎకరాలు గల ఒక స్థలాన్ని తన సొంత ధనముతో కొని దానిలో క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు నివసించుటకు సిద్ధం చేశారు. ఇందువలన ప్రజల సంతోషముగా సంరక్షణలో ఉన్నారు. తన కొరకు పొదుపు చేసిన డబ్బులు అన్ని కూడా క్రీస్తు కొరకు ఖర్చు పెట్టారు. కష్టపడుతున్న ప్రజలు కన్నీటితో ప్రార్థించారు. ఆ స్థలంలో నివాసం ఉంటున్న ప్రజలు దానిని వారి సొంత స్థలముగా అంగీకరించారు. అందువలన అది సాయర్ పురం అని పిలవబడుతుంది. ఈ దినము ఆ గ్రామం ఏర్పరచబడుటకు అదే కారణం.

 

హలో పిల్లలు ఈ సహాయం చేసిన సాయర్ అంకుల్ చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు కదా? నేను ఎవరికీ ఇవ్వను అని స్వార్థంతో జీవిస్తున్న ప్రజల మధ్యలో యేసు కొరకు తన ధనమును ప్రజలకు ఇచ్చి ప్రజల కొరకు దీవెనకరముగా జీవించారు సాయర్ అంకుల్. మీరు కూడా ఇచ్చి మేలైన వాటిని వెతికి అనేకుల కొరకు దీవెనకరముగా జీవించాలి. సరైన పిల్లలు! 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş