Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.07.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 30-Jul-2024

దిన ధ్యానము(Telugu) 30.07.2024

 

అంశం:- వివరించలేని ఆనందం 

 

"యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు" - నెహెమ్యా 8:10

 

రాజేష్ రెండు వారాలు ఇంగ్లాండ్ దేశంలో బస చేయవలసి వచ్చింది. వెంటనే అతని చేతులకు డబ్బులు వచ్చేస్తాయి అని నిరీక్షణతో ఉన్నాడు. రెండు దినాలు అయింది అమెరికా వెళ్లాలి విశ్వాసముతో వస్తువులు కొన్నాడు. ఆయన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మరియు అక్కడ ఎవరూ కూడా అతనిని తెలియదు కానీ దేవుణ్ణి నమ్మి ఆయన యందు సంతోషంగా ఉన్నారు. ఆఖరి నిమిషములో ధనము అతని చేతికి వచ్చింది. బసచేసిన స్థలానికి భోజనానికి అన్నింటికీ ఇవ్వవలసినదంతా కట్టి అక్కడ ఉన్న స్టీమ్ బోటుకి డబ్బులు కట్టి మిగిలిన ధనముతో అమెరికా దేశమునకు వచ్చారు. వివరించ లేనంత ఆనందం అతనికి. మనము చిన్నపిల్లల వలె దేవుడిని వంద శాతం నమ్మినప్పుడు 100% సంతోషం హృదయంలో నిండుతుంది.

 

సంతోషం అనే పదానికి గ్రీకు భాషలో కొనియాడుతున్న సంతోషము, ఆనందము అని అర్థము. క్రీస్తు పిల్లలమైన మనకు రోజు కొనియాడుతున్న ఆనందం కలదు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉండి కొనియాడదగిన సంతోషం ఇస్తున్నారు కదూ!

 

ఆర్యన్ స్టీరి అనేవారు ఇలా రాస్తున్నారు క్రీస్తు ప్రభువు నా రక్షకుడిగా అంగీకరించక ముందు అలసిపోయిన వాడిగా దుఃఖముతో నిండినవాడిగా కనబడ్డాను కానీ నిజమైన క్రైస్తవునిగా మారిన వెంటనే చింత అంటే ఎంత ఖరీదు అని అడిగే విధముగా ఎప్పుడూ అనగా లేమిలోనూ కొదువులోనూ సంతోషంగా ఉండగలుగుతాను అని అన్నారు. కానీ ఈ దినము అనేకులకు సంతోషం ఎప్పుడూ అంటే ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఉంటుంది. కొందరికి ఆడంబరమైన వస్తువులలో సంతోషం ఉంటుంది కానీ నిరంతరమైన శాశ్వతమైన ఆనందము దేవునిలో ఉండుట అనేదాన్ని మర్చిపోకూడదు. ఎన్ని లోపాలు ఎత్తు పల్లాలు వచ్చినా ఆయన చూసినప్పుడు వాటన్నిటిలో ఉన్న ఏమీ లేకుండా పోతుంది. మనము దేవునితో ఉండేటప్పుడు సమస్తాన్ని ఆయన హస్తమునకు సమర్పించినప్పుడు ఎనలేని ఆనందము ప్రతి దినము మనకు కలుగుతుంది దాన్ని కొనియాడవచ్చు. కష్టమైన సమయాలలో కూడా సంతోషంగా ఉండవచ్చు.

 

మనం ప్రతిరోజు 24 గంటలు కూడా ఆయనను నమ్మి ఆయనకు సమర్పించుకుని జీవించినప్పుడు సంతోషంగా ఉండగలం. దేవుని యందు ఎప్పుడు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి అని పౌలు ఫిలిప్పు సంఘమునకు రాస్తున్నప్పుడు బంధింపబడినవాడుగా చెరసాలలో ఉండినప్పటికీ సంతోషమును గూర్చిన రాస్తున్నాడు. దేవుణ్ణి నమ్మి ఆయన యందు సంతోషంగా ఉన్నవారు ఆయన బలాన్ని చూస్తుంటారు. ఎనలేని సంతోషముతో మన హృదయంలో నిండిపోయిన వారముగా ఎప్పుడూ ఆయన మనతో ఉన్నారు అనే సంతోషాన్ని ఆయన సర్వశక్తి కలిగిన దయగల తత్వాన్ని తరించినప్పుడు ఆయన పైన ఆనుకున్నప్పుడు ఈ సంతోషం మనకు కలుగుతుంది.

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యను ప్రార్ధన మరియు ధన సహాయం చేస్తున్న కుటుంబాలను దేవుడు దీవించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet tambet grandpashabet jojobet nesinecasino betbey betgit grandpashabet betpuan cashwin matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet grandpashabet grandpashabet giriş holiganbet giriş çarkbet çarkbet giriş