Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.08.2024
Share:

By Village Missionary Movement

Friday, 09-Aug-2024

దిన ధ్యానము(Telugu) 09.08.2024

 

అంశం:- ప్రశ్న అడగని విధేయత 

 

"దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను" - ఆదికాండము 6:2

 

అనేక సంవత్సరాలకు మునుపు ధనవంతుడు ఒకరు పనికి వ్యక్తులు కావాలి అని చెప్పి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూచి అనేకమంది యవ్వనస్తులు వచ్చారు. రెండు రోజులు ఆయన చెప్పిన పనులు చేశారు. మరుసటి రోజు వారు రాకుండా ఆగిపోయారు. చివరి వరకు ఒక యవ్వనస్తుడు మాత్రమే ఆ పనికి వచ్చాడు. ఆయనతో ఆ ధనవంతుడు అక్కడ పడి ఉన్న రాయి పిక్కలను తీసి కొంచెం దూరంలో వేయమన్నాడు. మరునాడు వాటిని తీసి ముందుండిన స్థలములోనికి వాటిని వేయమన్నాడు. ఇలా వారం రోజులు జరిగింది. ఆదివారము నీకు సెలవు అని అన్నాడు. ఒక వారానికి తగిన కూలిని అతని చేతికి ఇచ్చాడు.

 

సోమవారం ఆ యవనస్తుడు వస్తాడని ఎంత మాత్రం ఆయన ఎదురు చూడలేదు కానీ ఆ యవ్వనస్తుడైతే సోమవారం ఉదయానికి సరియైన సమయానికి పనికి వచ్చాడు. ఎందుకు ఏమిటి అని ఎలాంటి ప్రశ్న వేయకుండా యజమాని యొక్క ఆజ్ఞకు లోబడిన యవనస్తుడు వాడు చదువుకి, తెలివితేటలకు తగినట్టుగా ఉన్నత పనులు పొందుకున్నాడు. కొన్ని లక్షల రూపాయలు లావాదేవీలు చూచుటకు ప్రాముఖ్యమైన బాధ్యతలు ఆయనకు ఇవ్వబడ్డాయి. అలానే కొన్ని రహస్యాలను కాపాడుటకు కూడా ఆయన నియమించాడు. ఆయన ప్రాణం ఉన్నంతవరకు ఆయన కుటుంబమునకు మంచి కాపలాదారుడుగా ఉన్నాడు.

 

 భూమి పైన పాపం విస్తరించినప్పుడు దేవుడు లోకమును నాశనం చేయాలి అని ఆలోచించినప్పుడు నోవాహు అనే దేవుని దాసునితో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రచండ వర్షము కురవబోతోంది ఆ నాశనం నుండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకొనుటకు ఒక ఓడను తయారు చేయుము అని చెప్పారు. దానికంటే ముందు వర్షం భూమ్మీద పడిందా లేదా అని తెలియదు. అయినను అది ఎందుకు ఏమిటి అని ఎలాంటి ప్రశ్న అడగకుండా నోవాహు ఒక ఇంచు ఎక్కువ తక్కువ లేకుండా దేవుడు చెప్పిన కొలతల్లోనే ఆయన మాటకు లోబడి ఓడను తయారు చేశాడు. నాశనం నుండి ఆయన కుటుంబము తప్పించబడింది.

 

తర్వాత అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కనిన పిల్లవాడిని మోరియా పర్వతమునకు తీసుకుని వెళ్లి బలి ఇవ్వమని దేవుడు చెప్పారు. అలానే దేవుని మాటకు లోబడి అబ్రహాము తన భార్యతో ఏమీ చెప్పకుండా ఒకవేళ చెబితే ఆమె దేవుడికి ఇచ్చిన మాటకు ఆటంకపరుస్తుదేమో అని ఆలోచించి పని వారిని తీసుకుని ఉదయాన్నే బయలుదేరాడు. ప్రశ్న అడగకుండా దేవుని మాటకు లోబడిన ఆయనను ప్రభువు ప్రపంచం అంతటికి దీవెనకరమైన కారణంగా ఆయన మార్చారు. ఇలానే మనము కూడా ఎలాంటి ప్రశ్న అడగకుండా ప్రభువు యొక్క స్వరమునకు లోబడుతున్నప్పుడు ప్రభువు మనల్ని హెచ్చిస్తారు. ప్రభువు ఒక చోటికి వెళ్ళమని చెబితే ఎలాంటి తిరిగి ప్రశ్నలు వేయకుండా ఉంటే ప్రభువు మన ద్వారా అద్భుతాలు చేయబోతున్నారు అని గ్రహించి మనము చేయవలసిన కార్యాన్ని చేస్తే ఆయన చేయవలసిన కార్యాన్ని ఆయన చేసి ముగిస్తారు .

 

బ్రదర్. సి. పాల్ జబస్టిన్ రాజుగారు 

 

ప్రార్థన అంశం 

యవ్వనస్తుల ఉజ్జీవ కూడికల కొరకు దూర దూర ప్రాంతముల నుండి వస్తున్నటువంటి యవ్వనస్తుల ప్రయాణాల కొరకు వారికి క్షేమము కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort