Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.08.2024
Share:

By Village Missionary Movement

Monday, 12-Aug-2024

దిన ధ్యానము(Telugu) 12.08.2024

 

అంశం:- ఉపద్రవాలు 

 

"నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" - కీర్తనలు 119:71

 

అమెరికా దేశం నుండి చైనా వైపు వెళుతుంది ఆ నావ. సాయంకాల వేళలో ఆ నావా పై భాగములో ఒక క్రైస్తవ బోధకుడు ఒక వ్యాపారి మాట్లాడుతున్నారు. వ్యాపారి ఇలా అడుగుతున్నాడు మీరు చైనా దేనికొరకు వెళ్తున్నారు అని అడిగారు. అందుకు ఆ బోధకుడు నేను యేసయ్యను ప్రకటించుటకు వెళ్తున్నాను అని అన్నారు. ఒక నిమిషము దిగ్భ్రాంతికి గురైన ఆ వ్యాపారి చైనా దేశంనకు మిషనరీగా వెళ్లడము వ్యర్థము. ఒకసారి మెర్బి అనే బోధకుడు చైనాకు వెళ్ళాడు ఆయనను చైనా వారు ఎత్తుకొని వెళ్లి ఆయన చేతికి గల 3 వేళ్లను నరికి వేస్తారు ఆయన ఇప్పుడు అమెరికా దేశంలో ఉంటున్నారు. ఇవన్నీ మీకు తెలిసి ఉండి ఉంటే మీరు చైనా దేశంనకు వెళ్ళుటకు తేగించి ఉండరు అని అన్నాడు. అందుకు ఆ బోధకుడు నెమ్మదిగా నవ్వుకున్నాడు. తర్వాత అనేక కార్యము గురించి పంచుకున్నారు. కొంత సమయం తర్వాత వాళ్లకు టీ ఇవ్వబడింది టీ తీసుకున్న ఆ బోదకుడ్ని చూసినా వ్యాపారి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఎందుకు అంటే ఆయన చేతికి 3 వేళ్ళు లేవు. ఆ దినమున చైనా దేశంనకు వెళ్లిన మెర్బి ఈయనే. ఇతను వేళ్ళు నరికి వేయబడినప్పటికీ మరల దేవుని గురించి చెప్పుటకు బాధ్యతను అంగీకరించి భయము లేకుండా అటువంటి భయంకరమైన పరిస్థితిలో బయలుదేరాడు.

 

పౌలు, సిల సువార్త ప్రకటించినందుకు చెరసాలలో వేయబడ్డారు. అయినప్పటికీ వారు చెరసాలలో దేవుని స్తుతిస్తూ పాడారు అప్పుడు వారు బంధింపబడిన బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. వీరికి కాపలా ఉన్న ఆ అధికారి వీరు తప్పించుకుని వెళ్లిపోయారేమో అనుకొని ఆత్మహత్య చేసుకొనుటకు తలించాడు. ఆ సమయంలో ఆ యొక్క అధికారికి సువార్త ప్రకటించబడింది. ఆయన, ఆయన ఇంటి వారు కూడా సువార్తను విని రక్షణ పొందుకున్నారు. చెరసాల బయట ఉండి సువార్త ప్రకటించిన వీరు చెరసాలలో కూడా అదే పనులు చేసి రక్షణ మార్గాన్ని ప్రస్తావనం చేశారు.

 

ప్రియమైన వారలారా! ఎవరిని పంపెదను ఎవరు నా కొరకు వెళ్లెదరు అనే ప్రశ్న దేవుడు మన యొద్ద అడుగుతున్నట్లు గ్రహించిన ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి దేవుడు పౌలు యొక్క జీవితంలో ఎంత ఉపద్రవం వచ్చినప్పటికీ అది ఆయన యొక్క పరిచర్యను ఆపి వేయకుండా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళగలిగారు. ఉపద్రవాలు చూసి కొరడా దెబ్బలు ఏమిటి నా వేళ్ళు పోతాయేమో అని అనుకోకుండా పౌరుషముగా పరిగెత్తారు. ఎందుకంటే అలాంటి పనులు చేసిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తారు. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ఉపద్రవాలు పెద్దగా లెక్కచేయకుండా నా గమ్యస్థానము ఈ భూలోకము కాదు దానికంటే ఉన్నతమైన జీవ కిరీటము కొరకు పరిచర్య చేద్దాం. ఈ దినమే బయలుదేరుదాం దేవుడు మనకు తోడుగా ఉన్నారు.

- బ్రదర్. టి. శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

ఆగస్టు 15వ తారీఖున జరగబోతున్న యవ్వనస్తలు కూటమి కొరకు ప్రయాస పడుతున్న సేవకుల కొరకు వారి యొక్క ఆరోగ్యాల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort