Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.08.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 13-Aug-2024

దిన ధ్యానము(Telugu) 13.08.2024

 

అంశం:- కనికరముగల హృదయము 

 

"ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి" - లూకా 7:13

 

జర్మనీ దేశంలో చాలా పేద కుటుంబం ఒకటి నివసిస్తూ ఉండేది. వారికి ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. వాడు చిన్న బాలుడుగా ఉండేటప్పుడే ఆయన యొక్క తల్లిదండ్రులు మరణించారు. ఈ బాలుడు ఒంటరిగా మిగిలిపోయాడు. చక్కగా గిటార్ వాయించి పాటలు పాడే తలాంతులు గలవాడు. చల్లని రాత్రి ఒంటరిగా గిటార్ వాయిస్తూ నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన చేతి వేళ్ళు గిటార్ వాయించినప్పుడు వచ్చిన మ్యూజిక్ వలన పక్కనే ఉన్న వృద్ధ తల్లిదండ్రులు ఆయనను తన ఇంటిలోనికి పిలిచి ఆయనకు ఆహారము వస్త్రమిచ్చారు. అతడు అనాధ అని తెలిసిన వెంటనే అతనిని తన ఇంటిలో ఉండుటకు పరామర్శించి పెద్ద చదువులు చదివించారు. ఆ వ్యక్తి కూడా చాలా పెద్ద చదువులు చదివి పరిపక్వత చెందిన వ్యక్తిగా క్రైస్తవ సంస్కరణ నక్షత్రము అని పిలవబడుతున్న మార్టిన్ లూథర్. ఆ వృద్ధ దంపతులు బాలుడైన ఆయన పైన కనికరము చూపించడం వలన తాను గొప్ప సంస్కరణ నక్షత్రముగా సంఘ చరిత్రలో మిగిలాడు.

 

ప్రభువైన యేసు తాను మనిషిగా లోకంలో జీవించిన దినాలలో ప్రజలను చూచి కనికరపడ్డారు. కనికరపడిన వారిగా అద్భుతాలు చేశారు. అనేక సంఘటనలో యేసుక్రీస్తు కనికరించిన దాన్ని చూస్తున్నాం. దాంట్లో ఒకటి నాయిను ఊరిలో ఉన్న విధవరాలు యొక్క సంగతి. ఆమె విధవరాలుగా ఉండినప్పుడు ఆమెకు ఒకే ఒక కుమారుడు ఆ కుమారుడు కూడా మరణించాడు. ఆ కుమారుడ్ని సమాధి చేయుటకు వెళుతున్న సమయంలో ఆమె వచ్చి యేసయ్య యొద్ద కన్నీరు కార్చింది. యేసుప్రభు మరణించిన యవ్వనస్తుడ్ని లేపారు. మరణించిన యవ్వనస్తుడు లేచి కూర్చొని మాట్లాడడం ప్రారంభించారు. ఆయనను ఆయన తల్లికి అప్పగించారు. దీంట్లో కార్యని గమనించండి యేసయ్య ఒక తల్లి కన్నీరును చూచి కనికరపడి వెదకి వెళ్లి అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు యొక్క కనికరాన్ని దయగల హృదయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం.

 

ప్రియమైన వారలారా! మన ఇతరుల మీద కనికరం చూపుటలో యేసుక్రీస్తు వలె మారాలి. కనికరము చూపుటలో ఆయనను మాదిరిగా మనం ఉంచుకోవాలి. కనికర హృదయం అన్నది ఒక శ్రేష్టమైన గుణాతిశయం. తండ్రి అయిన దేవుడు మన మీద కనికరముగలవాడిగా తన ఏకైక కుమారున్ని ఈ లోకమునకు పంపించారు. ఆయన రూపంలో సృష్టించబడిన మనము కూడా కనికరముగల వారిగాను హృదయంలో దయగల వారిగాను ఉండాలి. దీనిని మనం ఆశించి ఆయన యొద్ద పొందుకుందాం.

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపు జరగబోతున్న మొరాయి సిటీ క్యాంపస్ లో దేవుని ప్రసన్నత నిలిచి ఉండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet