Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.08.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 18-Aug-2024

దిన ధ్యానము(Telugu) 18.08.2024 (Kids Special)

 

అంశం: చిన్న బాలుడు మరియు ధనవంతురాలైన ఘనురాలు 

 

"మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను" - మత్తయి 21:22

 

హలో పిల్లలు మీకు అవసరమైన కార్యాల కొరకు మొట్టమొదటిగా యేసయ్య దగ్గర ప్రార్ధన చేయాలి. చేస్తారా? లేదా అమ్మ నాన్నను ఇబ్బంది పెట్టి అడుగుతుంటారా? వర్షాకాలము రాబోతుంది దానికి గొడుగు కావాలని రైన్ కోట్ కావాలి అని ఆ అమ్మానాన్నను ఇబ్బంది పెట్టకూడదు. వీటి కొరకు యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలి. ఎక్కడక్క నేను ప్రార్థన చేస్తున్నా యేసయ్య నాకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు కదూ! ఇప్పుడు ఈ కథను వినండి యేసయ్య ఖచ్చితంగా ఇస్తారని నిరీక్షణ మీకు వస్తుంది. కథ విందామా?

 

అనేక సంవత్సరాలకు మునుపు న్యూయార్క్ నగరంలో జరిగిన నిజ సంఘటన ఇది. చలికాలంలో చలితో వణుకుతున్న నీ వలె ఒక చిన్న బాలుడు చిరిగిపోయిన బట్టలతో కాళ్లకు ఎలాంటి చెప్పులు లేకుండా వణుకుతూ ఉన్నాడు. అప్పుడు ఆ నగరంలో ఉంటున్న ధనవంతురాలైన ఒక ఘనురాలు తన గుర్రపు రధము పైన అటువైపు వచ్చారు. ఆమె కంటిలో ఈ బాలుడు యొక్క పరితాపకరమైన పరిస్థితి పడింది. వెంటనే తన రధమును ఆపమని చెప్పి దిగి నేరుగా ఆ బాలుని దగ్గరకు వెళ్లారు.

 

ఆ బాలుడి భుజం పైన చేతులు పెట్టి బాబు చలిలో దేనినో కిటికీలో నుండి చూస్తున్నావు కదా అని అడిగారు. వెంటనే ఆ బాబు చలి నుండి నా కాళ్ళను కాపాడుకొనుటకు యేసయ్య దగ్గర ఒక జత షు అడిగాను. ఆయన ఎలా ఇస్తారో అని ఎదురుచూస్తూ ఉన్నాను అని చెప్పాడు. వీడికి ఉన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని చూసిన ఆ ధనవంతురాలు ఆశ్చర్యపడి తన యొక్క విశ్వాస జీవితం గురించి సిగ్గుపడ్డారు. తర్వాత ప్రేమతో వాడి చేతులను పట్టుకుని షాపుకు తీసుకువెళ్లారు. షాపులో ఉన్న వ్యాపారులందరూ కూడా ఒక ధనవంతురాలు చిరిగిపోయిన బట్టలు కలిగిన ఈ బాబును తీసుకువస్తున్నారే అని ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తుకుని వచ్చారు. మొట్టమొదట ఆమె ఒక పెద్ద పాత్ర తీసుకుని దాంట్లో నీళ్ల నింపి

 

ఆ బాబును కుర్చీలో కూర్చుండబెట్టి వాడి కాళ్ళను శుభ్రంగా కడిగి తుడిచి కొత్త షూ ని వాడికి వేశారు. ఐదు జతలు షూ కొని వాడికి ఇచ్చారు. కొత్త డ్రెస్సులు మరియు చలిని తట్టుకోగలిగిన బట్టలు వాడికి కొన్ని ఇచ్చి వాటిని వాడికి ధరింపజెసి వాడికి ముద్దు పెట్టి వెళ్లారు. ఆ బాబు అయితే చాలా సంతోషించి యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పాడు. ఏంటి పిల్లలు మీరు కూడా ఆ బుజ్జి బాబు వలె నేను ప్రార్థిస్తే యేసయ్య ఖచ్చితంగా జవాబు ఇస్తారు అని నమ్మాలి. ఆయన పైన విశ్వాసం పెట్టాలి యేసయ్య పైన విశ్వాసం ఉన్నప్పుడు మీరు అన్నింటిని ఆయన యొద్ద నుండి పొందుకుంటారు. ఓకేనా!

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş