By Village Missionary Movement
Wednesday, 21-Aug-2024దిన ధ్యానము(Telugu) 21.08.2024
అంశం: యేసయ్యకు సమస్తము సాధ్యమే
"యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను" - మత్తయి 19:26
అమెరికాలో నెపోలియన్ టిప్ అనే గొప్ప వ్యాపారవేత్త ఉండేవారు. ఆయనకు రెండు చెవులు లేకుండా ఒక బాబు పుట్టాడు. ఆయన నా కుమారుడికి చెవులు వినిపించాలి అంటే ఎంత ఖర్చు అయినా పరవాలేదు అన్నారు అందుకు వైద్యులు అది జరగని పని అన్నారు. అయితే ఆయన మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని గ్రహించారు. ఆ బాబు కొరకు తొమ్మిది సంవత్సరాలు ఎడతెగక ప్రార్థించారు. నెపోలియన్ కి ఉన్న విధేయతతో కూడిన కన్నీటి ప్రార్థనకు జవాబు దొరికింది. చెవులు లేని ఆ బాలుడికి శబ్దములు వినిపించడం ప్రారంభించాయి. విశ్వాసం గల తన ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబుకి కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఆ బాబు గురించి తెలిసిన వైద్యులందరినీ మిగిలిన బంధువులందరికీ కూడా పిలిపించి ఒక పెద్ద విందు చేశాడు. దాంట్లో కృతజ్ఞత చెల్లించుటకు ఆ కూడికలో పాల్గొన్న వైద్యులు చెప్పిన సాక్ష్యాలు అనేకులను దేవుని వైపు విశ్వాసం గల వారిగా చెప్పగలిగాయి.
బైబిల్లో దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు. అబ్రహాము శార యొక్క వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకు లోకమునకు సాక్ష్యంగా ఉంటున్నాడు. జకర్యా ఎలిజిబెతు కు వృద్ధాప్యంలో పుట్టిన యోహాను కొత్త నిబంధనలో సాక్షిగా ఉన్నాడు. చూపు లేకుండా జన్మించిన పుట్టిన మొదలుకొని గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి నేత్రములు తెరవబడి యేసయ్య శక్తి లోకమునకు తెలియపరచబడింది. లాజరు మరణించి నాలుగు రోజులు సమాధిలో ఉండి మరల జీవాన్ని పొందుకున్నది యూదులకు విశ్వాసాన్ని కలిగించింది. ఈ దినము కూడా యేసయ్యను విశ్వసించినవారు అనేక ఆశ్చర్యకారులు పొందుకుంటున్నారు.
ప్రియమైన వారలారా! నా జీవితంలో కూడా ఇది జరుగుతుందా అని ఎదురుచూపుతో ఉన్నారా? ఈ కార్యము జరుగుటకు అనుకూలమైన పరిస్థితులు తక్కువ అవుతూనే ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా? నా వయసు ఎక్కువ అయిపోతుంది అని నిరుత్సాహపడుతున్నారా? చింతించొద్దు మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మీ జీవితంలో తలంచిన కార్యం ఏది కూడా నిరర్థకం కానివ్వడు. కచ్చితంగా జరిపిస్తారు విశ్వసించండి సమస్తము మీకు సాధ్యమవుతుంది.
- బ్రదర్. సామ్యూల్ మోరీస్ గారు
ప్రార్థన అంశం:-
ఆమెన్ విలేజ్ టీవీ ద్వారా నూతనముగా కిడ్స్ టీవీ ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250