By Village Missionary Movement
Sunday, 08-Sep-2024దిన ధ్యానము(Telugu) 08.09.2024 (Kids Special)
అంశం: సాక్షిగా ఉండుము
ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు
"మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి" - మత్తయి 5:16
హాయ్ పిల్లలు ఆటలు అంటే మీకు చాలా ఇష్టమే కదా? సెలవిస్తే చాలు మిమ్మల్ని పట్టుకోలేము కదు. మీరు ఏ ఏ ఆటలు ఆడుకుంటారు అని అడిగితే అనేకులు క్రికెట్ అని చెబుతూ ఉంటారు. మీలాగే కుమార్ అనే అబ్బాయి కూడా క్రికెట్ అంటే చాలా పిచ్చి వాడిలా ఆడుతూ ఉండేవాడు. అది మాత్రము కాదు చదువులోనూ, చర్చికి వెళ్ళుటలోనూ, ప్రార్థించుటలోనూ ఆయన క్రమంగ ఉంటాడు.
ఒక సెలవు దినమున కుమార్ తన స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. సంతోషముతో కేకలు వేస్తూ ఆటలాడుతున్నప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది తిరిగి చూస్తే వీళ్ళ ఆడుతున్న బాల్ పక్కింటికి గల అద్దమునకు తగిలి పగిలిపోయింది. ఆడుకుంటున్న అందరూ కూడా కుమారే కిటికీని పగలగొట్టాడు అని ఆయన మీద నేరం వేసి పారిపోయాడు. ఈయనయితే ఒంటరిగా నిలబడి ఏడుస్తూ ఆ ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు. ఆ ఇంటి వాకిటి ఎదుట లావుగా ఎత్తుగా ఉన్న ఒక ఆయన నిలబడి ఉన్నారు. కుమార్ కి ఆయన చూడగానే చాలా భయం వేసింది. కుమార్ ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్లి సారీ అంకుల్ నేనే మీ ఇంటి అద్దాన్ని పగలగొట్టాను నన్ను క్షమించండి అని బ్రతిమాలాడు. ఆ అద్దమునకు అయ్యే ఖర్చును మా నాన్నకు చెప్పి మీకు తెచ్చి ఇస్తాను అని చెప్పాడు. ఆ అంకుల్ కుమార్ ను చూసి ఏడవద్దు తమ్ముడు మీతో వచ్చిన వాళ్ళందరూ కూడా తమ తప్పును గ్రహించకుండా నీ మీద నేరం మోపి వారు పారిపోయారు. అయితే నీవైతే నీ తప్పిదమును వచ్చి అంగీకరించావు కనుక నిన్ను నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పి ఆయన తన ఇంటిలోను తీసుకుని వెళ్లి పెద్ద చాక్లెట్ ఇచ్చి కుమార్ను ఇంటికి పంపించేశాడు. కుమార్ సంతోషంగా ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ జరిగినదంతా కూడా ఒక పెద్దాయన చూచి కుమార్ ను పిలిచి నీ పేరేంటి, నీకు ఇలాంటి గుణాతిశయం ఎక్కడ నుండి వచ్చింది అని అడిగాడు అందుకు కుమార్ నేను ఒక క్రైస్తవుడిని క్రీస్తు ప్రేమ నాలో ఉంది అని చెప్పాడు. అందుకు ఆ పెద్దాయన నేను ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండినప్పటికీ ఇలాంటి గుణాతిశయం నాలో లేదే అని చెప్పి బాధపడ్డాడు.
అవును తమ్ముడు చెల్లి మీరు ఎలా ఉన్నారు? కుమార్ అన్నయ్య వలె తప్పు జరిగినప్పుడు దాన్ని దాచి పెట్టకుండా క్షమాపణ అడిగి కుమార్ అన్నయ్య వలె మాదిరిగా నడుచుకుంటూ క్రీస్తును మిత్రులకు ప్రకటిస్తారా?
- సిస్టర్. దేబోరా గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250