Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.09.2024
Share:

By Village Missionary Movement

Friday, 13-Sep-2024

దిన ధ్యానము(Telugu) 13.09.2024

 

అంశం: కొండమీద సమాధి 

 

"తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును" - మత్తయి 10:39

 

ప్రస్తుతం టూరిస్ట్ ప్రాంతాలలో సమాధి ఒకటి ప్రాముఖ్యమైపోతుంది. భారతదేశంలో టూరిస్టులుగా తాజ్ మహల్ నువ్వంటే అనేక స్థలములు కలవు. ఫ్రాన్స్ లో గల ప్యారిస్ పట్టణమందు ఒక సమాధి టూరిస్ట్ స్థలముగా ఉండేది. అక్కడ ఒక ప్రత్యేక సైంటిస్ట్ యొక్క సమాధి మిక్కిలి ధనము ఖర్చుపెట్టి అలంకరించబడి ఉండేది. ఫ్రాన్స్ వెళ్లిన ప్రజలు ఈ ప్యారిస్ కు వెళ్లి ఈ సమాధులు చూడకుండా వెళ్ళరు. అక్కడ వారు మరణించిన వాళ్లు ఘనత ప్రఖ్యాతి పలుకుబడిని ఉదాహరణగా ఈ సమాధి ఉండి ఉంటుంది. బైబిల్లో ఒకరు కొండమీద తన సమాధిని కట్టారు. సెప్న అనే వ్యక్తి భవనములో విచారణ కర్తగా ధనాగారం పైన అధికారిగా ఉండేవాడు. అనగా భవనంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించి మంచి రాబడి సంపాదించిన వాడిగా ఉండేవాడు. ఆయన కోరిక ఏమిటి అంటే ఉన్నతమైన స్థలములో తనకు సమాధి కట్టించబడాలి అన్నదే. అందువలన ప్రజలు ఎప్పుడు నన్ను తలంచి ఉండేటట్లు కొండమీద అన్ని సదుపాయాలు గల ప్రాంతంలో నా సమాధిని తయారు చేసి పెట్టుకుంటున్నాను అనే ఆలోచన ఆయనకు ఉండేది. అనగా తన అవసరానికి అధికముగా ఉన్న డబ్బుతో తన సమాధి కట్టి గర్వముగా ప్రవర్తించాడు.

 

సమస్యలు లేకుండా దీవెనలు వచ్చేటప్పుడు మనసు దేవుని వెతుకటలో తక్కువ అయిపోతుంది. దీనిని వలన జీవపు డంభము వచ్చేస్తుంది. జీవితం యొక్క ఉద్దేశము ధనాన్ని కాపాడుటగా మారిపోతుంది. ద్వితీయోపదేశకాండము 6: 10 నుండి 12లో గల వాక్యము నీవు తిని తృప్తి అయినప్పుడు దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడము అని చెప్పబడుతుంది. ఎందుకంటే సదుపాయాలు, దీవెనలు విస్తరించినప్పుడు మన మనసు దాని వైపు తిప్పబడకుండా హెచ్చరికగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నారు. దీవెనలు పెరిగేటప్పుడు మనుషునికి సాధారణంగా గర్వం వచ్చేస్తుంది దానికి మనం జాగ్రత్తగా ఉండాలి.

 

ప్రియమైన వారులారా! మన కార్యాల యొక్క ఉద్దేశం ఏమిటి తమకు మేలు కలగాలి అని బాబేలు గోపురాని ప్రజలు కట్టారు (ఆదికాండం 11:4) దేవుడు దానిని ఇష్టపడలేదు జనములను చెదరగొట్టారు. అవును మనము చేసే కార్యములకు పేరు పెట్టి అది ఘనత, గర్వము కొరకు కాకుండా దీనత్వం కలవారిగా ఉండాలి అలా ఉంటే దేవుడు మనతో ప్రేమగా ఉంటారు. మనలో ఇలాంటి ఆలోచన ఉందా అని మనల్ని మనం పరిశోధించి చూద్దాం. జాగ్రత్త పడదాం.

- బ్రదర్. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం:-

మీడియా పరిచర్యలో ఉన్న సేవకులకు విశేషమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al padişahbet padişahbet giriş