Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.09.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 17-Sep-2024

దిన ధ్యానము(Telugu) 17.09.2024

 

అంశం: ఉచితం 

 

"ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము" - ప్రకటన గ్రంథం 22:17

 

19 శతాబ్దంలో ఇరాన్ దేశానికి చెందిన యవనస్తుడు మంచుర్ సింగ్ క్రీస్తు యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. డెంటల్ డాక్టర్ అయిన మంచూరి సింగ్ ఉచితంగా వైద్యం చేస్తూ సువార్తను కూడా ప్రకటిస్తూ ఉండేవాడు. ఒక పరిస్థితిలో శిరాయి అనే చెరసాలలో ఆయన ఉండేటప్పుడు అక్కడ ఉండిన అధికారి మంచూర్ సింగ్ యొద్ద వుండిన కొత్త నిబంధన చూపించి ఇది ఎంత ఖరీదు అని అడిగాడు. ఇది ఉచితమే అన్నాడు మంచుర్ సింగ్ దీన మనస్సుతో. అధికారి అయితే నవ్వుతూ అర్హతలు లేని పుస్తకమునకు ఖరీదు ఇంతే అనీ హేళనగా నవ్వాడు. తర్వాత అధికారి పక్కనే ఉన్న మంచి వెలుగునిచ్చే ఒక లైట్ ని చూపించి దీనిని ఎక్కువగా వేల చెల్లించి కొన్నాను అని అన్నాడు. మంచూర్ సింగ్ కిటికీ యొద్ద నుండి సూర్యుని చూపించి పగలంతా వెలుగునిచ్చే ఈ సూర్యుడికి ఎంత వెల చెల్లిస్తారు అని అడిగాడు. జవాబు చెప్పడానికి అవకాశం లేక ఆ అధికారి తలదించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని కార్చి పాపక్షమాపణ, రక్షణ అనే దాన్ని ఉచితంగా ఇచ్చారు అన్నాడు. తన తప్పిదమును గ్రహించిన అధికారి మంచూర్ సింగ్ వద్ద క్షమాపణ అడిగాడు.

 

అపోస్తులకార్యములు 3వ అధ్యాయంలో పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతో కుంటివాడైన ఒకడు పేతురును యోహానును చూసి భిక్షమడుగుతున్నాడు. అందుకు వారు మా యొద్ద వెండి బంగారము లేదు మా యొద్ద ఉన్న వాటిని నీకు ఇస్తున్నాము యేసు నామములో లేచి నడుము అని చెప్పారు. పుట్టుకతో కుంటివాడు అయిన ఆ వ్యక్తి లేచి నిలిచి గంతులు వేస్తూ దేవున్ని మహిమ పరిచాడు. ఆ అద్భుత కార్యాన్ని ఉచితముగా పొందుకున్నాడు.

 

అవును నా ప్రియమైన వారలారా మనుషుల పాపము క్షమించబడుటకు ఎంత వెల చెల్లించినా క్షమాపణ దొరకదు కానీ ప్రభు యేసుక్రీస్తు మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చారు. మన పాపమును యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర మనలను సమర్పించుకొనుట వలన రక్షణ ఉచితమే. తీరని రోగము, పాపము బంధకాల్లో విమోచన పొందుటకు యేసయ్యను తేరి చూడండి. వీలువ కలిగిన రక్షణ, విడుదల, స్వస్థత మరియు కొదువులన్నీ కూడా తీరుతాయి. ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువు ఉచితముగా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. ఆసక్తి గలవారు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితముగా అడిగి పొందవచ్చు. మీరు సిద్ధమేనా?

- సిస్టర్. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరా పరిచర్య ద్వారా చేస్తున్న ప్రార్థనల ద్వారా అనేకులు దీవించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet