Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.09.2024
Share:

By Village Missionary Movement

Thursday, 19-Sep-2024

దిన ధ్యానము(Telugu) 19.09.2024

 

అంశం: కుమ్మరి హస్తములో 

 

"మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని" - కీర్తనలు 31:12

 

జపాన్ దేశంలో మట్టితో చేయబడిన ఖరీదైన అందము కలిగిన పాత్రను వారి యొక్క పిల్లలు నేల మీద పడేసినప్పుడు పగిలిపోతే ఆ పిల్లలను తిట్టడం గాని ఆ ముక్కలను చెత్త కుండీలో వేయడం చేయరు. విరిగిపోయిన ప్రతి ముక్కను శ్రద్ధగా ఏ ఒక్కటి విడిచి పెట్టకుండా తీసి వాటిని మంచి పాత్రగా మరల కొత్తగా అతికించే కళాకారుని వద్దకు తీసుకుని వెళ్తారు. ఈ కళాకారుని పేరు కించుకి. ఆ కళాకారుడు ఆ పగిలిపోయిన ఆ పాత్రను మరల పేస్ట్ వేసి అతికించి మునుపున్న పాత్ర కంటే ఇంకా అందమైన విలువ గలిగిన పాత్రగా తయారుచేసి ఇస్తాడు. ఆ పాత్రను వాళ్ళ ఇంటిలో శ్రేష్టమైన స్థలములో పెడతారు. 

 

 యీర్మియ 18 వ అధ్యాయంలో కుమ్మరి వాడి చేతిలో చేయబడిన మట్టి కుండా విరిగిపోయింది. ఆ కుమ్మరి ఆ పాత్రను వేరే పాత్రగా చేశాడు. దీన్ని చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా మీరు నా జీవితము అయిపోయింది అని అంగలారుస్తూ ఉండవచ్చు, నా వివాహ బంధము ఇలా చెడిపోయింది, నా చదువులో నేను మంచి మార్కులు తెచ్చుకోలేక దిక్కులేనివాడుగా ఉంటున్నానే లేక ప్రభుత్వ పని కొరకు ఉద్యోగం కొరకు అనేక సార్లు ప్రయత్నించి అపజయముతో నలిగిపోయి ఉన్నానే అని బాధపడుతూ ఉండవచ్చు, నా భవిష్యత్తు ఏమిటి? ఇక నేను జీవించగలనా? నా జీవితంలో పైకి రాగలనా? అని విరిగిన హృదయముతో కన్నీళ్ళతో మనసులో భారంతో ఉండవచ్చు. కలవర పడుకుడి పరమ కుమ్మరి హస్తములో మిమ్మల్ని సమర్పించుడి.

 

 దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా మీ యొక్క జీవితాన్ని దేవుని హస్తములో సమర్పించుడి. కించుకి అని పిలవబడుతున్న ఆ కళాకారుడు విరిగిపోయిన వస్తువులు చాలా అందమైన ప్రయోజనమైన వస్తువుగా మార్చగలిగితే దానికంటే గొప్పవాడైన మన పరమ తండ్రి హస్తములో మనము విరిగిపోయిన జీవితాన్ని సమర్పించినప్పుడు అనేకులు చూచి ఆశ్చర్యపడే విధముగా మనలను తయారు చేసి ఉన్నత స్థానంలో పెట్టుటకు సమర్థుడు కాబట్టి కలవర పడుకుడి, ఆలస్యము చేయకుడి, దేవుని యొద్దకు తీవ్రతతో వెళ్లి మీ జీవితాన్ని సమర్పించుడి. ప్రభువా నేను విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను నా జీవితాన్ని బాగు చేయుటకు ఏ మనుష్యుడు వల్ల కాదు నా వలన కూడా కాదు మీరు మాత్రమే దానిని బాగు చేయగలరు. నన్ను మీకు సమర్పిస్తున్నాను అని ప్రార్థించి చూడండి అద్భుతాన్ని చూడగలరు.

- శ్రీమతి. దవమని వైరవెల్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యలో సహాయం చేస్తున్న సపోర్టర్స్ ను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet