Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.09.2024
Share:

By Village Missionary Movement

Friday, 20-Sep-2024

దిన ధ్యానము(Telugu) 20.09.2024

 

అంశం: నిదానమే ప్రధానము 

 

"తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును" - 1 పేతురు 2:20

 

క్రిస్తు నందు ప్రియమైన వారలారా మతిస్థిమితం లేని ఒక ఆయన మీద కరుణ చూపించాడు ఒక ఆయన. తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆయన తండ్రి ఆయనను ఒక మూలన కూర్చుండబెట్టి ఆహారమును నీళ్లను అతనికి ఇవ్వు కానీ నీవు ఎలాంటి సహాయము చేయవద్దు. ఆకలి ఉంటే ఆయనే ఆహారం తీసుకుని తింటాడు అన్నాడు. ఆయన కూడా అలానే చేశాడు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాడు రాళ్లను తీసి ఇతరులపై వేస్తూ ఉంటాడు. అందుకనే అతనిని ఎవరు పట్టించుకోరు. రోజులు గడుస్తున్న కొలది ఆయన తన వ్యతిరేక కార్యములు విడిచిపెట్టి కొంచెం కొంచెంగా బాగుపడటకు కారణమైంది. ఇప్పుడు ఆయన అరవడం లేదు రాళ్లు విసరడం లేదు దాన్ని చూసిన తండ్రి వ్యతిరేకతను చూపించుటకు ఎవరూ లేరు కాబట్టి ఆయన యొక్క గుణాతిశయం మారింది అన్నాడు. అలానే మనతో వాదన చేసే వారి వద్ద ప్రతి వాదన చేయకుండా ఉంటే అక్కడ గొడవలు వచ్చే అవకాశం లేదు. యేసుక్రీస్తు కూడా శిష్యులతో చెప్పినప్పుడు కీడుకు ప్రతి కీడు చేయవద్దు అన్నారు. మిమ్మల్ని ఒకడు ఒక చెంప పైన కొట్టిన యెడల మరొక చెంప చూపించండి అన్నారు. మీ వస్త్రమును తీసుకోవాలి అనుకున్న వారితో నీ పై వస్త్రము కూడా తీసి వానికిమ్ము అన్నారు. ఒక మైలు రమ్మని బలవంతం చేసిన ఎడల వారితో రెండు మైళ్ళు వెళ్ళమని చెప్పారు.

 

అవును ప్రియమైన వారలారా మనము ఈ విధముగా మన చుట్టూ ఉన్న వాళ్లతో ఎలా ఉంటున్నాం అనేదాని గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. ఒకరు మన గురించి ఏదైనా చెప్పిన ఎడలా మనము సహనం కోల్పోయి వాళ్ళని అద్దిస్తున్నామా? మనం అలా చేయకుండా ఉందాం. సహనముతో ఉందాం. మన దేవుడు మనలను ఘనపరుస్తారు. దీనిని దేవుని దాసుడైన మోషే చేశాడు. మోషే భార్య పైన ఉండిన వ్యతిరేకత వలన మోషే తోబుట్టు వారు ఆయన పైన నేరం మోపినప్పుడు ఆయన అయితే తన వైపు న్యాయాన్ని ఎత్తి చూపించటకు మాట్లాడలేదు. మోషే మాట్లాడి ఉంటే అక్కడ గొడవ జరిగి ఉండేది నిదానంగా ఉన్నాడు. దేవుడే ఆయన కొరకు మాట్లాడారు మనం నిదానాన్ని వెంబడిద్దాం దేవుని ఘనతను పొందుకుందాం. 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన చిన్న పిల్లల కొరకు సపోర్ట్ చేస్తున్న పార్ట్నర్స్ కుటుంబాలు దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet