Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.10.2024
Share:

By Village Missionary Movement

Thursday, 10-Oct-2024

దిన ధ్యానము(Telugu) 07.10.2024

 

అంశం: గొప్ప పని 

 

"అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా" - యెషయా 6:8

 

స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ సంస్థ వారు తమ ఇండోనేషియా దేశపు బ్రాంచ్ కి ఒక మేనేజర్ ని వెతుకుతూ ఉన్నారు. నిజాయితీగల, తెలివితేటలు గల ఒక వ్యక్తిని వెతికారు. అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ మిషనరీకి ఆహ్వానం ఇచ్చారు. పరిచర్యలో నిజాయితీగా ఉండిన ఆ మిషనరీ ఆయనకు కంపెనీవారు ఇచ్చిన పనికి రావడానికి తిరస్కరించాడు. 30 డాలర్ల జీతం ఇస్తానని ఆ కంపెనీ యజమానుడు చెప్పాడు. అందుకు ఆ మిషనరీ తిరస్కరించాడు. మీరు ఎంత అడిగిన ఇస్తామని చెప్పాడు అందుకు ఆయన నేను ఇప్పుడు చేసే పనితో పోల్చుకుంటే మీరు పిలిచే ఈ పని చాలా చిన్నది అన్నాడు.

 

మిషనరీలు అంటే కష్టపడుతున్న వాళ్ళుగానూ, సాధారణ వాళ్ళు గాని ఇది దేవుని పని మహోన్నతుడైన దేవుని రాజ్యము కొరకు చేసే పని. ఈ పని చేసేటప్పుడు పౌలు ఎన్నో ఇరుకులలో ఉండినప్పటికీ ఆయన కృంగిపోలేదు అని చెబుతున్నాడు. శరీరంలో అనేక శ్రమలు అనుభవించారు. సువార్త నిమిత్తము అనేక కష్టాలు అనుభవించారు. అయినను పౌలు కలత చెందలేదు దుఃఖపడలేదు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని బలపరుస్తారు. సమాధానకర్తగా మనకు తోడుగా ఉండి మనకు బలం ఇచ్చి ఎలాంటి హాని కలుగకుండా మనలను నడిపిస్తున్నారు. పౌలుని విషపూరితమైన పాము కాటు వేసినప్పటికీ దేవుడు ఎలాంటి హాని కలుగకుండా సంరక్షించారు. దేవుడు కొన్ని పట్టణాలలో పౌలు దెబ్బలు తినుటకు అనుమతించినప్పటికీ వెంటనే లేచి వెళ్ళుటకు బలాన్ని ధైర్యాన్ని దేవుడు ఇచ్చారు. దేవుడు మనకు చేయిని విడిచి పెట్టే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్దాన శక్తి ప్రతిరోజు మన పరిచర్యలో అనుభవించగలం. నేహేమ్య గొప్ప భవనములో పనిచేసినప్పటికీ దానిని పెద్ద పనిగా తలంచకుండా దేవుని కొరకు చేసే పని గొప్ప పనిగా ఎంచుకున్నాడు.

 

ప్రియమైన వారలారా మీ యొక్క జీవితంలో గొప్ప ఉద్దేశ్యము పరలోక రాజ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు అక్కడికి అనేకమందిని చేర్పించే పరిచర్యలో మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. ఎలాంటి పని చేసినప్పటికీ దాని మధ్యలో దేవుని చివరి ఆజ్ఞ అయినా బయలుదేరి వెల్లుడి సువార్త ప్రకటించుడి అని మహోన్నతమైన పనిలో మిమ్మల్ని చేర్చుకొనుడి. మీ యొక్క పిల్లలు సంపూర్ణంగా దేవుని రాజ్య నిర్మాణంలో పనిచేయుటకు పంపించండి. దేవుని దీవెనలు పొందుకొనుడి. 

- శ్రీమతి. బేబీ కామరాజు గారు 

 

ప్రార్థన అంశం:- 

మన మిస్టరీలను సపోర్ట్ చేస్తున్న కుటుంబాలు దీవించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş