Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.04.2021
Share:

By Village Missionary Movement

Friday, 30-Apr-2021

దిన ధ్యానము(Telugu) 30.04.2021

తిరిగి రా! 

"...తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా"? - లూకా 15:4

ఒక కాపరి యొద్ద 100కు పైబడిన గొర్రెలు ఉండేవి. మంద పైన మిక్కిలి శ్రద్ధ కలిగి ఉన్న ఆయనకు కొన్ని నెలల ముందు పుట్టిన గొర్రె పిల్ల అంటే చాలా ఇష్టం. దానికి డాలి అని పేరు పెట్టి పిలుస్తుండే వారు. డాలి అల్లరి చేస్తూ ఎదుగుతూ వచ్చింది. కాపరికి తెలియకుండా తనకు ఇష్టమైన చోటుకు వెళ్లి జాలీగా తిరిగేసి సాయంత్రం దొంగతనంగా మందలో కలిసి ఇంటికి వచ్చేది. ఇలాగే ఒక దినము మంద నుండి బయటకు వెళ్లి చాలా దూరం వెళ్ళి గొప్ప ప్రమాదంలో పడి గట్టి గా అరుస్తూ ఉన్నప్పటికీ అది ఎవరికి వినపడలేదు. సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో డాలీ ని వెతికిన కాపరి అది కనబడక పోవడం వలన దానిని వెతుకుతూ అటు ఇటు దానిని పిలుస్తూ ముందుకు వెళ్లారు. కాపరి యొక్క స్వరం విన్న డాలి నేను ఇక్కడే ఉన్నాను నన్ను కాపాడండి అని దుఃఖముతో కేక వేస్తుంది. కాపరి దానిని కనిపెట్టి తన బుజము మీద వేసుకొని వెళ్లారు. నన్ను క్షమించండి అని చూస్తున్నట్లు డాలి మొఖం కనిపించింది.

బైబిల్లో ఒక తండ్రికి ఇద్దరు కుమారులలో చిన్న వాడు లోకాన్ని చూసి దానిని అనుభవించుటకు తన తండ్రి యొద్ద ఉన్న ఆస్తిలో తన భాగాన్ని తన ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. కాని తండ్రి అయితే తన కుమారుడు ఏదో ఒక దినము తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. చిన్న కుమారుడు తన స్నేహితులతో లోక సంతోషాలు అనుభవించాడు. ఒక దినము తన యొద్ద ఉన్న ధనం అంత కూడా ఖర్చు అయిపోయింది. స్నేహితులు విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆయన తినడానికి తిండి కూడా లేక ఉన్నప్పుడు తన తండ్రి యొక్క ఆదరణ, సంరక్షణ గురించి ఆలోచించి తండ్రి యొద్దకు వచ్చారు. ఆయన కుమారుడు వలె కాక మురికి వస్త్రంతోను, మాసిపోయిన మొఖం తోను వచ్చాడు. అయినప్పటికీ తండ్రి పరిగెత్తుకొని వెళ్లి కౌగలించుకొని ముద్దాడి ఆయనకు కొత్త వస్త్రం ధరింపజేసీ, ఉంగరాన్ని పెట్టి మరల తన కుమారుని గానే అంగీకరించారు. 

దీనిని చదువుతున్న స్నేహితులారా! ఆ గొర్రె తన ఇష్టానుసారంగా వెళ్లినట్లు, చిన్న కుమారుడు తన స్నేహితులతో లోక సంతోషంతో ఇంటిని విడిచి వెళ్లినట్లుగాను మనం కూడా కొన్ని ఆకర్షించే లోక కార్యములు చూచి పరమ తండ్రి అయిన దేవున్ని ఆయన ప్రసన్నతను విడిచి, ఆయన ప్రణాలికను విడిచి దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోతున్నామా? ఒక్క నిమిషం అలోచిద్దాం. తల్లి గర్భంలో మనము ఏర్పడినది మొదలుకొని ఈ దినము వరకు ఎంతగా మిమ్మల్ని పరామర్శించి, సంరక్షించి, అవసరతలు తీర్చి నడిపించారు అనే దాన్ని ఆలోచించి చూడండి. మరల ఆయన యొద్దకు తిరిగి రండి. పరమ తండ్రి ఈ దినము వరకు మిమ్మల్ని అంగీకరించుటకు ఈ దినము వరకు అదే ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి చేర్చుకొనుటకు ఆశక్తితో ఉన్నారు. ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యొద్దకు రండి. రెండు చేతులు చాపి ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నారు. 
-    బ్రదర్. జె. ఎబినేజర్.

ప్రార్థన అంశం:-
పిల్లల కొరకు ఎదురు చూస్తున్న మిషనరీ దంపతులకు దేవుడు పిల్లలను దయచేయులాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet