Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.10.2024
Share:

By Village Missionary Movement

Friday, 18-Oct-2024

దిన ధ్యానము(Telugu) 18.10.2024

 

అంశం: కోపం - అది దుఃఖానికి దారి తీస్తుంది

 

"ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును" - ప్రసంగి 7:9

 

ఎవరెలా ప్రవర్తించినా కోపం రానివ్వని ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అవమానపరిచినా పట్టించుకునేవాడు కాదు. చాలా మంది అతనిని కోపపెట్టడానికి ప్రయత్నించినా ఎవరూ విజయవంతం కాలేకపోయారు. అతని స్నేహితుల్లో ఒకరు, అతను ఎలా ఇంత శాంతంగా ఉంటున్నాడో తెలుసుకోవాలనుకున్నారు. వారు అతని వద్దకు వెళ్లి, "మీకు ఎలా కోపం రాకుండా ఉండగలుగుతున్నారు?" అని అడిగారు.

 

అప్పుడు ఆ వ్యక్తి తన రహస్యం చెప్పారు. "ఒక సరస్సులో ఖాళీ పడవలో నిద్రపోవడం నా అలవాటు. ఒకసారి నేను అలా నిద్రపోతూ ఉండగా, మరో పడవ వచ్చి నా పడవను ఢీకొట్టింది. నేను నిద్రనుండి తేరుకొని, 'ఎవరిది ఈ అజాగ్రత్త' అని కోపంగా కళ్లతెరిచి చూశాను. కానీ అది ఖాళీ పడవ. గాలికి ఊగుతూ నా పడవను ఢీకొట్టింది. ఆ పడవపై కోపాన్ని చూపడం వృథా. అప్పటి నుండి ఎవరైనా నన్ను కోపపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఆ సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. 'ఇది కూడా ఖాళీ పడవ' అని భావించి శాంతంగా ఉంటాను."

 

ఆ స్నేహితుడు ఈ కథ విని ఆలోచనలో పడ్డాడు. బైబిల్లో దావీదు, నాబాలు అనే మనిషి కోపం మరియు చెడ్డ స్వభావం కారణంగా ఎలా బాధపడాడో చూస్తాం. దావీదు అతన్ని చంపడానికి సైన్యంతో వస్తున్నప్పుడు, నాబాలు యొక్క భార్య అబిగయేలు బుద్ధిగా వ్యవహరించి, దావీదు యొక్క కోపాన్ని శాంతపరిచింది. ఈ కారణంగా దావీదు హత్య చేయవలసిన స్థితి నుండి తప్పించబడ్డాడు.

 

అవును, ప్రియమైన వారలారా! చాలా సందర్భాల్లో మన కోపం కారణంగా మన ఆశీర్వాదాలను కోల్పోయాం. అందువల్ల, మనం క్రీస్తు బోధనల ప్రకారం సయమం పాటించాలి. బైబిలు చెబుతుంది, "నీ ఆత్మలో త్వరగా కోపగించకుము; మూర్ఖుల గుండెలో కోపం నిలుస్తుంది." అని. మన త్వరిత కోపం వల్ల మనము ఎంతో మంది స్నేహితులను కోల్పోయి ఉండవచ్చు. ఈ కోప స్వభావాన్ని మార్చడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. యేసయ్య చెప్పారు, "మీ శత్రువులను ప్రేమించండి." ఇదే యేసయ్య మనకు చూపిన దారి. కాబట్టి, మనం ఆయనను అనుసరించాలి. దేవుని ఎదుట శుద్ధులుగా, అపరాధరహితులుగా ఉండడానికి మనలను పరిశీలించుకుందాం. ఆమేన్!

- శ్రీమతి దివ్యా అలెక్స్ గారు

 

ప్రార్థన అంశం:

మన చిన్నారుల శిబిరంలో పాల్గొన్న పిల్లలు ప్రభువులో స్థిరంగా ఉండేలా ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet