Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.10.2024
Share:

By Village Missionary Movement

Monday, 21-Oct-2024

దిన ధ్యానము(Telugu) 21.10.2024

 

అంశం: మోకాళ్లపై వంగి ప్రార్థన చేయండి

 

"అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను" - అపో.కార్యములు 20:36

 

ఒక మిషనరీ సంస్థ ఒక ఊరిలో సేవ చేయడానికి ఒక మిషనరీని పంపించింది. అతను ఉత్సాహంగా వెళ్లి అక్కడ తన సువార్త పరిచర్యను ప్రారంభించాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఎవరూ అతని బోధనలను వినలేదు. ప్రజలు చాలా కఠినంగా వ్యవహరించేవారు మరియు చెడు జీవితాన్ని జీవించేవారు. అతను ప్రతిరోజూ నిరంతరం బోధిస్తున్నప్పటికీ, కొద్దిమంది కూడ సువార్తను నమ్మ లేదు. అందువల్ల అతను అలసిపోతూ నగరంలోని మరొక భాగానికి వెళ్లాడు. అతని యొక్క అన్ని ప్రయత్నాలు వృథా అయినట్లుగా భావించాడు. అక్కడ రోడ్డు పక్కన పెద్ద రాళ్లను పగులగొడుతున్న ఒకరిని చూశాడు. అతను పెద్ద రాళ్లను సుత్తితో పగులగొట్టడాన్ని చూస్తున్నాడు. మిషనరీ అతని వద్దకు వెళ్లి, "సార్, మీరు ఇలాంటి పెద్ద బలమైన రాళ్లను ఎలా పగులగొట్టగలుగుతున్నారు?" అని అడిగాడు. అతను రాళ్లను పగులగొట్టేటప్పుడు మోకాళ్లపై వంగి ఉంటానని చెప్పారు. "మేము మోకాళ్లపై వంగినప్పుడు మా బలం పెరుగుతుంది అని చెప్పాడు. ఏ రకమైన కఠినమైన రాళ్లైనా పగులగొట్టవచ్చు" అని అతను చెప్పాడు. వెంటనే మిషనరీకి దేవుడు అతనితో మాట్లాడుతున్నట్లు అర్థమైంది. అతను ఆనందంగా తిరిగి వెళ్లాడు. అప్పటి నుండి అతను గంటల తరబడి మోకాళ్లపై వంగి ప్రార్థన చేస్తూ విజయాన్ని సాధించాడు. దానియేలు, ఎలీయా, పౌలు, ఎస్తేరు అందరూ ప్రార్థన చేసి విజయం పొందారు.

 

బైబిల్ గ్రంధంలో ఎంతోమంది ప్రజలు వారి ప్రార్థనల ద్వారా విజయాలు సాధించారు. హన్నా పుట్టెడు కన్నీళ్లతో ఒక శిశువుకు కొరకు ప్రార్థించింది. ఆమె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచింది. ఆమెకు ఆ ఆశ్చర్యం కలిగింది.

 

ప్రియమైన వారలారా, ఇది నా జీవితంలో జరుగలేదు, నా జీవితంలో నిరంతర పరాజయం కొనసాగుతోందా అని మీరు ఆందోళన చెందుతున్నారా? ఆందోళన చెందకండి. మోకాళ్లపై వంగి దేవుని దగ్గర గట్టిగా ప్రార్థించండి. మనం మోకాళ్లపై వంగి మన హృదయాలను ఆయన ముందుకు పెట్టినప్పుడు, మనం అడిగినదాన్ని పొందవచ్చు. మోకాళ్లపై వంగిన ప్రార్థన మన బుద్ధి చేయలేని వాటిని సాధించగలదు. మోకాళ్లపై వంగిన ప్రార్థన అద్భుతాలను చేయగలదు. మన బలహీనతలను మార్చగలదు, మన కన్నీళ్లను తుడవగలదు. కాబట్టి, విజయ రహస్యం తెలుసుకొని, ఈ రోజు నుండి మోకాళ్లపై వంగి ప్రార్థన చేస్తూ విజయాన్ని సాధిద్దాం. 

- సిస్టర్. శివ గారు

 

ప్రార్థన అంశం: 

మన అన్ని మిషనరీ ప్రాంతాలలో 24 గంటల సుదీర్ఘ ప్రార్థనలు జరుగు లాగున ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon grandpashabet palacebet sonbahis wbahis grandpashabet betpuan betsalvador matbet meritking