Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.10.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 27-Oct-2024

దిన ధ్యానము(Telugu) 27.10.2024 (Kids Special)

 

అంశం: ఒక జ్వాల వనిత

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను" - కీర్తనలు 91:14

 

ఆ ఎత్తైన కొండలు, అందమైన పచ్చిక మైదానాలు, కట్టిపడేసే ప్రవాహాలతో వున్న గ్రామంలో వనిత అనే చిన్న పాప ఉండేది. ఆమెకు అన్న మరియు అక్క ఉండేవారు. వనిత మూడు సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నప్పుడు ఆమె తల్లి మరణించింది. అందువల్ల ఆమె తండ్రి, అన్న మరియు అక్క ఆమెను ఎంతో ప్రేమతో పెంచారు. వనిత పెరిగి ఆదివారం పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టింది. యేసయ్య యొక్క ప్రేమతో నిండిన ఆమె యేసుని మరింత ఆశతో వెతకడం ప్రారంభించింది. ఊరిలో ఒక చర్చి ఉంది. ఆ చర్చి గడియారం మోగడానికి ముందు లేవాలి అనే తపన ఆమెకు కలుగుతుంది. ఆమె ఆ అనుభూతిని అనుసరించి లేచి ప్రార్థన చేస్తూ ఉండేది.

 

తన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికీ వనిత ఇష్టమైనది, ఎందుకంటే ఆమె చిన్న వయస్సులోనే యేసుని వెంబడించడం కోసం ఎంతగానో తపించేది. వనిత 10వ తరగతి వరకు చదువుకుంది. అయితే, వనిత తండ్రి ఆమెను చదివించలేక ఆమె చదువులను ఆపేశారు. అది ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కొంతకాలానికి ఆమెతో చదివిన మిత్రులు ఆమెను "ఎస్ఎస్ఎల్సి" అని హేళన చేస్తూ ఉండేవారు. దానితో ఆమె మరింతగా యేసుని వెతకడం ప్రారంభించింది. యేసయ్య ఆమె ప్రార్థన విన్నారు. కొన్ని రోజులలోనే ఆమె ప్రార్థనకు స్పందనగా ఓ ఉత్తరం విదేశాల నుంచి వచ్చింది. అది ఆమె తండ్రి బాల్యమిత్రుని నుండి. “వనిత చదువులకు నేను డబ్బులు పంపిస్తాను” అని, ఖర్చులు చెల్లించడానికి అవసరమైన డబ్బులు పంపించారు. వనిత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరోవైపు, ఆమె ఆశ్చర్యపడి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ యేసయ్యకు ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. పాఠశాలలో తన చదువులను పూర్తి చేసిన తరువాత, ఆమె తనను పూర్తిస్థాయి సువార్త ప్రచార సేవలో అంకితముగా పెట్టుకుంది. చాలా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది. అంతే కాకుండా, ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి భాష నేర్చుకొని యేసుని ప్రకటించింది. చిన్నతనంలోనే యేసయ్య పట్ల ఉన్న ఆ తపన మరియు అభిరుచే ఆమెకు అనూహ్యమైన చోటనుండి మంచి కలిగించి, ఉన్నత స్థానంలో ఉంచింది.

 

చిన్న పిల్లలారా! యేసయ్య కూడా వనితలా యేసుని వెతుకుతున్న పిల్లలను ఆశిస్తున్నారు. అలాగే మీరు ఉండండి. యేసయ్య మిమ్మల్ని మెరుగుగా తీర్చిదిద్దుతాడు. సరేనా!

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon grandpashabet palacebet sonbahis wbahis grandpashabet betpuan betsalvador matbet meritking