Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 20-Nov-2024

దిన ధ్యానము(Telugu) 20.11.2024 (Gospel Special)

 

అంశం: శుభవార్త ప్రచారం

 

"నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను" - యోహాను 4:14

 

కెనడా దేశంలో ఒక అనాథ బాలుడు ఉన్నాడు. అతను ఆహారం లేకుండా, బట్టలు లేకుండా కష్టపడుతూ జీవించాడు. ఒక పాస్టర్ అతన్ని చూసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఒకరోజు ఆ పాస్టర్ ఆ బాలుడికి కొన్ని శుభవార్త కరపత్రికలు ఇచ్చి, "యేసుక్రీస్తు మిమ్మును ప్రేమిస్తున్నారు అని ప్రతి ఒక్కరికి చెప్పి, ఈ కరపత్రికలు ఇచ్చిరా, చీకటి పడకముందు తిరిగి వచ్చేయ్" అని పంపించాడు. ఆ బాలుడు ఆనందంగా ఆ కరపత్రికలో ఇచ్చాడు. చివరకు ఒక కరపత్రిక మాత్రమే మిగిలింది. దానిని ఎవరికివ్వాలో అని ఆశగా ఎదురు చూశాడు.

 

ఆ సమయంలో ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి తలుపు బాగా కొట్టడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీ ఉన్నది. ఆమెకి ఎవరూ లేరు. ఒంటరితనంతో, మనోవేదనతో, ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలోనే ఆ బాలుడు ఆ ఇంటి తలుపు ఎడతెగకుండా కొడుతూనే ఉన్నాడు.

 

కోపంతో ఆ స్త్రీ తలుపు తీయగా, ఆ బాలుడు చిరునవ్వుతో, "అమ్మా, యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు" అని చెప్పి ఆ కరపత్రిక ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ స్త్రీ తలుపు మూసుకుని, ఆ కరపత్రికలో ఏముంది అని ఆసక్తితో చదవడం ప్రారంభించింది. అందులో యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని, ఆ ప్రేమ తెలుసుకోవడానికి సభకు రమ్మని రాసి ఉంది. ఆ స్త్రీ ఆత్మహత్య ఆలోచనలను విడిచిపెట్టింది.

 

తదుపరి రోజు ఆమె ఆనందంతో సభకు వెళ్లి, యేసుక్రీస్తును తన వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించిందని సాక్ష్యమిచ్చింది. ఆ బాలుడు ఇచ్చిన శుభవార్త ఒక ప్రాణాన్ని కాపాడి రక్షణలోనికి నడిపించింది.

 

ఇలాగే యోహాను 4:6-30 లో సమారియా స్త్రీతో యేసు మాట్లాడి, ఆమె జీవిత విశేషాలను వెల్లడించి, తానే మెస్సీయా అని తెలిపాడు. ఆమె ఆపరిమితమైన ఆనందంతో తన ఊరికి వెళ్లి, యేసు క్రీస్తు గురించి చెప్పి, అనేక మందిని రక్షణలోనికి నడిపించింది.

 

అదేవిధంగా, మనకు దేవుడు చేసిన శ్రేయస్సును మనలోనే దాచిపెట్టకుండా, మన చుట్టూ ఉన్నవారితో పంచుకోవాలి. యేసు గొప్పతనాన్ని, ఆయన ప్రేమ నిబంధనలేనిదని చెప్పాలి. మనం శుభవార్తను పంచుకునే పనిలో దేవుడు మనకు "పాండిత్యపు నాలుక" (యెషయా 50:4) ప్రసాదించాలని ప్రార్థిద్దాం. శుభవార్తను సాహసంగా, ఫలప్రదంగా ప్రకటిద్దాం.

 

ప్రార్థన అంశం:

"కన్మణియే కేళ్" అనే యువతుల కార్యక్రమం ద్వారా అనేక మంది యువతులు ప్రభువుకోసం లేచి, తమ జీవితాలను ఆయనకు అర్పించాలనీ ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş