By Village Missionary Movement
Friday, 22-Nov-2024దిన ధ్యానము(Telugu) 22.11.2024 (Gospel Special)
అంశం: చిన్న ఆరంభం
"సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు" - 1 కోరింది 1:26
ఈరోజు మనం చెన్నైలోని కొలత్తూరు చర్చి ద్వారంలో పువ్వులు అమ్ముతూ జీవించేందుకు వచ్చిన ఒక వృద్ధ మహిళ ద్వారా జరిగిన గొప్ప విషయాన్ని పరిశీలిద్దాం. ప్రతి ఆదివారం ఆ వృద్ధ మహిళ చర్చి సాంగ్స్, వాక్యాలు వినే సదుపాయం పొందుతూ ఉండేది. కొంతకాలానికి ఆ మహిళ రక్షణ పొందింది మరియు చర్చి సభ్యురాలిగా మారింది.
ఆమె ఆదివారాలు పువ్వులు అమ్మడం మానేసి నిష్టగా సేవలకు హాజరయ్యేది. కొన్ని సంవత్సరాల్లో, వృద్ధాప్యం కారణంగా ఆమె మరణించింది. కానీ ఆమె వలన 12 కుటుంబాలు ప్రభువు దగ్గరకు తీసుకురాబడ్డాయి. ఆ 12 కుటుంబాలూ అదే చర్చి సేవల్లో పాల్గొంటూ ఉన్నాయి. సాధారణంగా కనిపించే ఈ అమ్మమ్మ, ప్రాణాల్ని గెలుచుకోవడంలో గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క గొప్ప సాక్ష్యం చదవవచ్చు. ఆ సమరయ స్త్రీ మాటల వలన ఒక గ్రామం మొత్తం రక్షణ పొందింది. ప్రభువు తన సేవా క్షేత్రంలో సాదాసీదా వ్యక్తుల ద్వారా గొప్ప పనులు చేశారు. సువార్త ప్రచారం చేయడానికి అనేక ప్రతిభలు లేదా అనుగ్రహాలు అవసరం లేదు వ్యక్తులను రక్షించాలనే ఆత్మల పట్ల భారం ఉంటే సరిపోతుంది.
క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ సందేశాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువమందిని ప్రభువు వద్దకు నడిపించాలి. వ్యక్తిగత సువార్త ద్వారా అందరినీ ప్రభువు యొద్దకు నడిపించండి. మీ ప్రాంతంలో ఎదురుగా ఉన్న గ్రామంలో పిల్లల మినిస్ట్రీలు, పత్రికలు పంచడం వంటి చిన్న పనులు చేయండి. ఆ ఆరంభం ఎంత చిన్నదైనా, దేవుడు దాని ఫలితాన్ని మారుస్తారు. ఈరోజు చిన్న ఆరంభం చేయాలని నిర్ణయించుకోండి. సువార్త సేవలో ప్రభువు మిమ్మల్ని వాడుకుంటారు. పరిచర్య విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను వాడుకొనును గాక. ఆమెన్
- బ్రదర్. జాకబ్ శంకర్ గారు
ప్రార్థనా అంశం:
పశ్చిమ బెంగాల్‌లో పరిచర్య చేయుటకు దేవుడు ద్వారములు తెరువు లాగున ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250