Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Saturday, 23-Nov-2024

దిన ధ్యానము(Telugu) 23.11.2024 (Gospel Special)

 

అంశం: దేవుని పాత్రలు

 

"ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును" - 2 తిమోతికి 2:21

 

మనమందరం దేవుని చేతిలో పాత్రలమే. ఈరోజు ఈ లోకంలోని ప్రజలంతా ఇతరులచే ఉపయోగించబడే పాత్రలుగా జీవిస్తున్నారు. అపొస్తలుడైన పౌలు, దేవునిచేతిలో ఆత్మీయ పాత్రగా మారి, ప్రపంచమంతటికి రక్షణను అందించడంలో ఉపయోగించబడ్డాడు. అదే విధంగా టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా తన సేవలతో ప్రపంచానికి ఉపయుక్తమైన పాత్రగా నిలిచారు. ఈ విధంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా ఇతరులకు సహాయపడే పాత్రగా ఉండి ఉంటారు. దేవునిచేత సృజించబడిన ఆత్మీయ పాత్రలమై, దేవుని చిత్తప్రకారం ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాల్సిన పిలుపు మనకు ఉంది.

 

సాధు సుందర్ సింగ్ ఒక సిక్కు సంప్రదాయంలో పెరిగారు. ఆయన క్రీస్తును, బైబిల్‌ను ద్వేషించేవారు. కానీ ప్రభువు ఆ పాత్రను ఎన్నుకుని, ప్రపంచ ప్రజలకు క్రీస్తును తెలియజేశాడు. ప్రపంచ చరిత్రలో క్రీస్తును తెలుసుకుని, ప్రకటించినవారు ప్రత్యేక వ్యక్తులుగా నిలిచారు. మిషనరీలుగా వచ్చిన వారు సమాజాలలో మార్పులు తీసుకువచ్చి, చరిత్రను సృష్టించారు. విలియం కేరీ భారతదేశ సమాజాల్లోని మూఢనమ్మకాల్ని తొలగించి, సంస్కరణలు తీసుకువచ్చారు.

 

ప్రతీ మిషనరీ ప్రపంచంలో తీసుకువచ్చిన మార్పుల గురించి వ్రాస్తే, ఆ వివరాలకు ప్రపంచమే సరిపోదు! మానవ మాంసం తినే జీవన విధానంలో ఉండిన నాగాలాండ్ ప్రజలు, క్రీస్తును స్వీకరించి నేడు క్రైస్తవులుగా ఉన్నారు. ఇదే విధంగా, అనేక దేశాల్లో మానవులను వేటాడి తినే అలవాటుతో ఉన్న వారు కూడా దేవుని చేతిలోని త్యాగమూర్తులైన మిషనరీల ద్వారా మార్పు పొందారు. ఆఫ్రికా దేశాల ప్రజలు, ఏనుగుల్లా జీవిస్తూ ఉండి, నేడు మానవుల్లా జీవిస్తున్నారంటే, అది మిషనరీల త్యాగఫలితమే.

 

మిషనరీలు దేవుని చేతుల్లో ఉపయోగకరమైన పాత్రలుగా మారినట్లే, క్రీస్తును స్వీకరించిన ప్రతీ వ్యక్తీ తమ ప్రాంతాల్లో దేవుని చేతుల్లో ఉపయోగకరమైన పాత్రలుగా మారేందుకు అంకితం చేయాలి. మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? మనం దేవుని చేతుల్లో ఉంటే ప్రభువుకి ఉపయోగకరమైన పాత్రలుగా, నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకురాగల పాత్రలుగా జీవిస్తాం.

- బ్రదర్ శామ్యూల్ మోరిస్ గారు

 

ప్రార్థనా అంశం:

ఈ సంవత్సరంలో లక్ష మంది పిల్లలకు క్యాంప్ల ద్వారా సువార్త చేరేలా దేవుడు మార్గాలు తెరవాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet