Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.11.2024 (Gospel Special)
Share:

By Village Missionary Movement

Monday, 25-Nov-2024

దిన ధ్యానము(Telugu) 25.11.2024 (Gospel Special)

 

అంశం: గోధుమ గింజ

 

"గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును" - యోహాను 12:24

 

గోధుమ గింజ ఉపయోగం ఏమిటి? అది ఆహారంగా గానీ లేదా విత్తనముగా గాని ఉంటుంది. అవును, ఒక విత్తనం చనిపోతుంది మరియు ఎన్నో కొత్త గింజలుగా బయటికి వస్తాయి. సువార్త కొరకు తమ జీవితాలను అర్పించి సువార్తకై శ్రమించేవారిని గోధుమ గింజలతో పోలుస్తుంది బైబిల్.

 

జేమ్స్ చాల్మర్స్ అనే మిషనరీ దంపతులు ఆస్ట్రేలియా ఉత్తర భాగంలోని న్యూ గినియా దీవికి సువార్త ప్రకటించేందుకు వెళ్లారు. ఆ దీవిలో ప్రజలు నరమాంసభక్షకులు (క్యానిబల్స్) అనే సంగతి తెలిసినప్పటికీ, దేవుని ప్రేమతో నిండిపోయి, ఆ ప్రజల కోసం వెళ్లారు. 105కి పైగా ఉన్నా చిన్న దీవుల ప్రజలకు క్రీస్తు ప్రేమను ప్రకటించారు. సుమారు 90 దీవుల ప్రజలకు సువార్తను బోధించిన మొదటి తెల్లవాడు జేమ్స్ చాల్మర్స్.

 

1901, ఏప్రిల్ 8, ఈస్టర్ ఆదివారం నాడు, ఆయన మరియు అతని స్నేహితుడు ఒలివర్ టామ్‌కిన్స్ కర్రిబారి అనే దీవికి వెళ్లారు. అక్కడి స్థానికులు వారిని ఉత్సాహంగా స్వాగతించారు. వారి స్వాగతం నిజమైనదని భావించి ఆనందించుచుండగా, అనూహ్యంగా వారి మీద దాడి జరిగింది. క్షణాల్లోనే వారి శరీరాలను ముక్కలు చేసి ఉడికించి తిన్నారు. వారు ఆ ప్రజలకు ఆహారంగా మారిపోయారు.

 

బైబిల్లో, అనేక పరిశుద్ధులు మరియు మొదటి శతాబ్దపు అపోస్తులులు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు. మొదటి హతసాక్షి, స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు (అపొస్తలులు 7:60). హెబ్రీయులకు 11:36,37 ప్రకారం, కొందరు విశ్వాస సమరయోధులు అవమానాలు, చితక బాదడం, బంధాలు, చెర, రాళ్లతో కొట్టడం, కత్తితో చంపడం వంటి ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆ జాబితా ఇంకా కొనసాగుతుంది. ఇంతే కాకుండా, నేటికీ, అనేక సువార్త బోధకులు సువార్త కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్నారు.

 

ప్రియమైన వారలారా, అప్పటిలాగే నేడు కూడా ప్రపంచంలోని అనేక దేశాల్లో సువార్త ప్రకటించడం ప్రమాదకరమే. అలాంటి సంఘటనలను విని, మనం వెనుకడగులు వేస్తాం. కానీ యేసు క్రీస్తు తన శిష్యులను సువార్త బోధించుటకు పంపినప్పుడు, “శరీరాన్ని చంపేవారిని భయపడవద్దు; కానీ ఆత్మను మరియు శరీరాన్ని నరకంలో నశింపజేయగలవానికి భయపడండి” అని చెప్పాడు (మత్తయి 10:28). ఆయన వారిని ధైర్యంతో పంపించాడు. అవును, మనము కూడా ధైర్యంగా సువార్త బోధించడానికి ముందుకు సాగుదాము. ఆయన చిత్తం లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు; మనలను పిలిచినవాడు మనతోనే ఉన్నాడు. భయపడకండి.

- సిస్టర్ మంజుల గారు

 

ప్రార్థనా అంశం:

మా యూత్ క్యాంపుల్లో పాల్గొన్న యువకులు దేవుని కొరకు జీవించేందుకు ఆత్మా ప్రేరణ కలుగజేయమని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş