Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.12.2024
Share:

By Village Missionary Movement

Friday, 06-Dec-2024

దిన ధ్యానము(Telugu) 06.12.2024

 

అంశం: సువార్త కోసం కోల్పోవడం

 

"...కాని ఎవడు నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును కోల్పోతాడో, అతడు దానిని రక్షించుకొనును" - మార్కు 8:35

 

17వ శతాబ్దంలో ఇంగ్లాండులో క్రైస్తవ సువార్త ప్రకటించడం నిషేధం అనే చట్టం అమలులో ఉంది. అయినప్పటికీ, ‘జాన్ హాకెట్’ అనే ఒక వ్యక్తి నిర్భయంగా దేవాలయంలో సువార్తను బోధిస్తున్నాడు . కొంతసమయం తరువాత, ఒక సైనికుడు తుపాకీ పట్టుకొని వాక్యం బోధిస్తున్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతడు ఆ బోధకుడ్ని చూసి, "మీ బోధనను తక్షణం ఆపండి" అని ఆజ్ఞాపించాడు. ఆ బోధకుడు, “నేను దేవుని సేవకుడిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను; మీరు మీ సైనిక కర్తవ్యాన్ని చేయండి” అని చెప్పి తన బోధనను కొనసాగించాడు. ఆ సైనికుడు అతడిపై తుపాకీ గురిపెట్టినప్పటికీ, అకస్మాత్తుగా తుపాకీని కిందకి దించి, అక్కడినుండి ఆ సైనికుడు బయటికి పరుగెత్తిపోయాడు. దానికి కారణమేమిటో దేవుడికి మాత్రమే తెలుసు.

 

బైబిల్ చెబుతుంది: “ఎవడు నన్ను ప్రేమించునో, అతనిని నేను విడిపింతును... ఆయన శ్రమలో నాతో కూడ ఉండును; అతనిని విడిపించి ఘనపరచుదును.” - కీర్తనలు 91:14,15

 

దేవుడు అబ్రహాముతో, ఇస్సాకును బలి అర్పించమని కోరినప్పుడు, అబ్రహాము తన ఒకగానొక్క కుమారుడ్ని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడిని ఎంతో ప్రేమించి, తన వారసుడిగా పెంచిన తన కుమారుడిని కూడా ఇవ్వడానికి వెనుకాడలేదు. అబ్రహాము హృదయాన్ని దేవుడు చూశాడు. అతడి ప్రేమను గమనించాడు. తన ప్రేమ కోసం ఇస్సాకును అర్పించడానికి సిద్ధంగా ఉన్న తన సేవకుడి హృదయాన్ని గౌరవించి, తిరిగి ఇస్సాకును అతనికి ఇచ్చాడు. “ఇతడు చనిపోయినవానిని మళ్లీ పొందినట్టు లెక్కగట్టాడు” అని హెబ్రీయులు 11:19 చెబుతుంది.

 

దేవుని సంతానమా! ఈ ఆలోచనను మనం తలచుకుందాం. మనం దేవుని కోసం ఏమి కోల్పోయాము? ఆత్మలను రక్షించేందుకు లేదా సువార్త ప్రకటించేందుకు ఏమైనా త్యాగం చేసామా? సువార్త నిమిత్తము ధైర్యంగా ముందుకు వెళ్లుదాం. ఎంతమంది చేత తిట్టించుకుని, అపవాదులు పొందారు? ఎంతమంది దెబ్బలు, అవమానాలు అనుభవించారు? మనం కూడా అలాంటివి అనుభవిస్తే, మనం ఎంత ఆశీర్వదింపబడినవారమో తెలుసుకోండి! మనం కోల్పోయినదాన్ని దేవుడు తిరిగి పూర్ణంగా మనకు దయచేస్తాడు. ఈ లోకంలోనే శ్రమలతో కూడిన శతగుణ ఆశీర్వాదాలు, మరణాంతరం నిత్యజీవం మనకు లభిస్తుంది. హల్లెలూయా!

- శ్రీమతి ప్రిస్కిల్లా థియోఫిలస్ గారు

 

ప్రార్థనా అంశం: 

ఈ నెలలో మనం సందర్శించే గ్రామాలలో క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, ప్రభువు నామం మహిమపరచబడాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet