Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.12.2024
Share:

By Village Missionary Movement

Monday, 23-Dec-2024

దిన ధ్యానము(Telugu) 23.12.2024

 

అంశం: అసూయ (జెలసీ)

 

"సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు" - సామెతలు 14:30

 

మాలతి కుటుంబం సంపన్నమైనది. వారి ఇంట్లో సరుకులకు మరియు డబ్బులకు కొరత లేదు. కానీ వారి ఎదురింట్లో నివసించే అమ్ము ఇంట్లో అంత సదుపాయాలు లేవు. మాలతి ఇంటి సౌఖ్యాలను చూసి అమ్ము అసూయపడేది. ఒక రోజు మాలతి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి అందులోని అన్ని వస్తువులు బూడిదయిపోయాయి. ఇది చూసిన అమ్ము తనలో తాను ఆనందించింది. మాలతి కుటుంబం రోడ్డున పడిపోయిందని ఆమె అనుకుంది. కానీ మాలతి ఒక చిన్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత మొత్తం పొందింది. వారు ఇల్లు మళ్లీ నిర్మించడానికి మట్టిని తవ్వినప్పుడు, బంగారు నాణేల ఖజానా లభించింది. మాలతి కుటుంబం మళ్లీ సౌఖ్య జీవితం పొందింది. కానీ అసూయతో ఉన్న అమ్ము ఆనందంగా జీవించలేకపోయింది. చూడండి, అసూయ ఆమె జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించనివ్వలేదు.

 

బైబిల్లో యాకోబు, రాహేల కుమారుడైన యోసేపు జీవితం చాలా గొప్పది అని దేవుని యోచన. యోసేపు తన కలలను తండ్రి ముందు చెప్పినప్పుడు, అతని సొంత సోదరులు అతనిని ద్వేషించారు. వారు అతనిపై అసూయపడి, అతన్ని ఇష్మాయేలులకు ఇరువది వెండి నాణేలకు అమ్మివేశారు. అయితే దేవుని యోచన ప్రకారం, యోసేపు ఈజిప్టు పాలకుడయ్యాడు.

 

ప్రియమైన స్నేహితులారా! మన పొరుగు వారి అభివృద్ధిని చూసి ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి కోసం సంతోషించాలి. అసూయ కేన్సర్ లాంటిది. అది మన జీవితాన్ని కొంచెం కొంచెంగా నశింపజేస్తుంది. అసూయ అనే వ్యాధి మనలను పూర్తిగా నాశనం చేయగలదు. దేవుని సహాయం తీసుకోవడం ద్వారా మాత్రమే మన హృదయాలను తినేస్తున్న అసూయ నుండి బయట పడగలుగుతాం. కాబట్టి, ఈ అసూయ అనే వ్యాధిని విడిచిపెట్టి, విశ్వాసంతో దేవుని చేరుదాం.

 

ప్రార్థన అంశం:

మా క్యాంపస్‌లోని ట్యూషన్ సెంటర్ పిల్లలు దేవుని జ్ఞానంతో నింపబడాలి అని ప్రార్థించండి.

 

 శ్రీమతి. గ్రేస్ జీవమణి గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş cratosroyalbet realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet betgit radissonbet grandpashabet romabet nesinecasino grandpashabet