By Village Missionary Movement
Tuesday, 31-Dec-2024దిన ధ్యానము(Telugu) 31.12.2024
అంశం: స్తుతి
"యెహోవా నిత్యము స్తుతినొందును గాక! ఆమేన్ ఆమేన్" - కీర్తనలు 89:52
ఒక వృద్ధుడు ఒక హోటల్కు వెళ్లి భోజనం ముగించి, తాను తిన్న పాత్రలను ప్లేట్లో చక్కగా సర్దాడు. అప్పటికే సర్వర్ వచ్చి ఆ ప్లేట్ను తీసుకుని, పాత్రలను విడదీసి గ్లాసులు, కప్పులను శుభ్రం చేశాడు. వృద్ధుడు అతనిని చూశాడు, నవ్వి ధన్యవాదాలు చెప్పాడు.
కొన్ని వారాల తర్వాత, బస్టాండ్లో గుంపు కనిపించింది! ఆ గుంపు వైపునకు చూస్తే, వృద్ధుడు మూర్ఛిపోయి కుప్పకూలి ఉన్నాడు. అక్కడ ఎవరో వాటర్ ప్యాకెట్ కొనుక్కొని, ఆయన మీద చల్లారు. ఆ వృద్ధుడిని హోటల్కు తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినమన్నారు. ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో అడిగాడు, "మీరు ఎవరు?"ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "గత వారం, ఈ హోటల్లోనే మీ ప్లేట్ తీసుకుంటే మీరు నవ్వుతూ నాకు ధన్యవాదాలు చెప్పారు! అది నేనే. నా పనిలో ఎవరూ నాకు ధన్యవాదాలు చెప్పలేదు. ఏవేవో చెబితేనేగాని, ఎవరూ నా ముఖం వైపు కూడా చూడరు. కానీ, మీరు నవ్వుతూ చెప్పిన ధన్యవాదాన్ని నేను జీవితాంతం మరచిపోలేను."
"ప్రతి విషయములో కృతజ్ఞత చెప్పుడి; ఇదే క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము." (1 థెస్సలొనికయులకు 5:18) మనము కృతజ్ఞత చెప్పడం దేవుని చిత్తం. దశదిశగా ఉన్న కుష్టరోగులను యేసు స్వస్థపరిచాడు. కానీ, వారిలో ఒక్కరు మాత్రమే వచ్చి కృతజ్ఞతలు చెప్పినప్పుడు, ఆయన, "మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ?" అని అడిగాడు. మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు, దేవున్ని మహిమపరిచిన వారము అవుతాము.
ఈ సంవత్సరం మొత్తం దేవుడు మన ప్రాణాలను రక్షించాడు, కానీ మనం తలుస్తాం, ఎన్ని కష్టాలు పడ్డామని. కానీ, మన క్షీణతలో, చిన్నచిన్న విషయాల్లో మనం విసిగిపోయినప్పుడు కూడా దేవుడు మనకు ఆశను ఇచ్చాడు. దానికి మనం కృతజ్ఞతలు తెలపాలి కదా? మన విశ్వాసాన్ని నిలబెట్టేది ప్రభువు మాత్రమే. విశ్వాసాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే దేవుడు ఆయనే. (హెబ్రీయులకు 12:1)
మనం ఎంత బలహీనంగా ఉన్నా, ఆయన మన ప్రాణాలను కాపాడి మరో అవకాశాన్ని ఇచ్చాడు. గతించిపవలసిన వారముగా ఉన్నను, ఇంకా జీవితం ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పండి.
యోబు, అన్నీ కోల్పోయినప్పటికీ, దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆయనకు రెండంతల ఆశీర్వాదాలు లభించాయి కదా?
ప్రియమైన వారలారా!
ఈ సంవత్సరం ప్రారంభం చూసినవారిలో కొందరు ముగింపు చూడలేదు. కానీ దేవుడు మనలను రక్షించి నిలబెట్టాడు. దీనికోసం మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ఏడాది మనం ఎదుర్కొన్న కష్టాలను మాత్రమే గుర్తు చేసుకుంటున్నప్పటికీ, మనకు ఆయన ద్వారా లభించిన మంచికి కృతజ్ఞతలు తెలపండి. యెరికో వలె కష్టాలు మరియు బాధల స్థలాన్ని మరిచి, కొత్త సంవత్సరంలో కొత్త దీవెనలతో ప్రవేశిద్దాం.
- శ్రీమతి అంబుజ్యోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:
కొత్త సంవత్సరానికి నిర్ణయాలు మరియు లక్ష్యాలను ప్రణాళిక చేయడంలో దేవుడు మా ఉద్యమ నాయకులతో ఉండాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250