Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.01.2025
Share:

By Village Missionary Movement

Wednesday, 01-Jan-2025

దిన ధ్యానము(Telugu) 01.01.2025

 

అంశం: మీ విశ్వాసాన్ని బలపరచుకోండి

 

"అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను" - యోహాను 11:40

 

తమ్ముడి మరణంపై అక్కచెల్లెళ్లు దుఃఖిస్తూ విలపిస్తున్నారు. వారి దుఃఖాన్ని చూచి, వారితో ఉన్నవారు కూడా ఏడుస్తున్నారు. వారు తమ్ముడు సమాధి చేయబడిన సమాధి వద్దకు చేరుకున్నారు. వారి దుఃఖాన్ని చూచి ఆయన చెబుతున్నాడు, "నీవు కోరుతున్న ఆశీర్వాదం ఈ రాయిని ఆవల ఉంది అని. అందుకు అక్కచెల్లెళ్లు చెబుతున్నారు, నా సహోదరుడు మరణించి నాలుగు రోజులు అయ్యింది; మృతదేహం వాసన వస్తుంది." అందుకు ఆయన "రాయిని తొలగించండి అని చెప్పిన వెంటనే ఆ రాయిని తొలగించారు, ఆయన మృతుడి పేరు పెట్టి లాజరు బయటికి రా అని పిలిచారు . అద్భుతం! లాజరు సజీవుడిగా బ్రతికి బయటకు వచ్చాడు! అవును, అతనే లాజరు, అతన్ని బ్రతికించినవాడు యేసుక్రీస్తు, అక్కచెల్లెళ్లు మార్త, మరియ.

 

కర్త యేసుక్రీస్తు మీతో ఉన్నాడు. మీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన శక్తివంతమైన చేతిని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, మీ దుఃఖం, బాధ, కష్టాలను ఆయన బాగా తెలుసుకుంటాడు. వాటికి పరిష్కారమూ, మార్గమూ ఆయన దగ్గరే ఉన్నాయి. మార్త, మరియ ఏడుస్తున్నప్పుడు యేసు కూడా వారితో కలిసి కన్నీరు పెట్టుకున్నాడు. మనుషులు కన్నీరు పెట్టి ముందుకు వెళ్లిపోతారు. ఈరోజు కాల పరిస్థితుల్లో మన కష్టాలను చూసి సానుభూతి చూపే వారే ఎక్కువ. కానీ మనతో కలిసి ఏడ్చే వారు చాలా తక్కువ. కానీ యేసు మీతో ఏడ్చే వారు మాత్రమే కాదు; మీ దుఃఖానికి కారణమవుతున్న పరిస్థితులను మార్చగలిగేవాడు.

 

మీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగలేదు అని మీరు ప్రశ్నిస్తున్నారా? రాయిని తొలగించాలి. అవిశ్వాసం అనే రాయి అద్భుతాన్ని పొందటానికి అడ్డుపడుతోంది. యేసు చెబుతున్నాడు, "నేనే పునరుత్థానం మరియు జీవనమునై యున్నాను; నన్ను విశ్వసించువాడు చనిపోయినా బ్రదుకును." – యోహాను 11:25. విశ్వసిస్తే మీరు అద్భుతాన్ని పొందగలుగుతారు. మార్త "నాలుగు రోజులు అయింది," అని చెప్పినప్పుడు యేసు "నీవు విశ్వసించినయెడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పుచున్నాననేను అని చెప్పాడు.

 

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. "ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? నాకు దారేమీ లేదు. నా ఆశలన్నీ చనిపోయినట్టే కనిపిస్తున్నాయి. నేను ఏమి చేయాలి?" అని మీరు విచారిస్తున్నారా? మిమ్మును మీరు పరిశీలించి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ఆయన వైపు విశ్వాసంతో చూడండి. "నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను" అని చెప్పిన ఆయన యుగాంతం వరకు మీతో ఉంటాడు. మీరు "ఇది ముగిసింది, నా జీవితానికి దారిలేదు" అని అనిపిస్తున్న చోట ఆయన జీవం నింపి, కొత్త ఆరంభాన్ని ఇచ్చి, తండ్రిని మహిమపరచునట్లు చేస్తాడు. కానీ ముందు మనం మనల్ని పరిశీలించి, మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ఆశీర్వాదాలను, అద్భుతాలను పొందటానికి విశ్వాసాన్ని బలపరచండి. నేను ఎప్పుడూ చెప్పినట్లే, ఇప్పుడు కూడా చెబుతున్నాను, మీ కుడివైపున దేవుడు ఉన్నాడు. సమస్యలు, అయోమయాలు, పోరాటాలు వచ్చినప్పుడు విశ్వాసంతో మీ కుడివైపు చూడండి. "యేసుప్రభూ, మీరు నా వెంట ఉన్నారు కదా, దయచేసి చూసుకోండి" అని ఆయనకు అప్పగించండి. మీరు నిత్యం అద్భుతాలను చూడగలుగుతారు.

- కె. డేవిడ్ గణేశన్ గారు

 

ప్రార్థన అంశాలు:

ఈ సంవత్సరంలో మన సువార్త సేవల కోసం మరియు సేవకుల ఆరోగ్యానికై ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet