Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.01.2025
Share:

By Village Missionary Movement

Wednesday, 08-Jan-2025

దిన ధ్యానము(Telugu) 08.01.2025

 

అంశం: ఆరాధన బలి పీఠం

 

"యెహోవా గొప్ప దేవుడు, సమస్త దేవతలకంటే శ్రేష్ఠుడు” - కీర్తనలు 95:3

 

బైబిలు మన ఆరాధనను రెండు వర్గాలుగా విభజించింది:

 

1. వృథా ఆరాధన (మత్తయి 15:8, యెషయా 29:13)

 

2. జ్ఞానముగల ఆరాధన (రోమీయులు 12:1)

 

మనసు, శరీరం, ఆత్మలను సజీవ బలిగా సమర్పించడం జ్ఞానముగల ఆరాధన. ప్రభువును మహిమపరచడం, స్తుతించడం, కృతజ్ఞతలు చెప్పడం, బలిపీఠంపై బలులు సమర్పించడం ఇవి కూడా ఆరాధనే! నేడు మనం ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం. మన ఆరాధన జ్ఞానముగలది కాకపోతే, మన ఆరాధన బలిపీఠాన్ని మరమ్మతు చేసుకుందాం!

 

1. మన ఆత్మ, శరీరం, ఆత్మలను సజీవమైన బలిగా సమర్పించాలి. దాని అర్థమేమిటి? అన్ని విషయాలలో దేవుని చిత్తానికి లొంగాలి. మన శరీర కార్యాలను దేవుని చేత కాల్చి వేయబడడానికి సమర్పించాలి.

 

2. ఆయన సన్నిధికి స్తోత్రంతో రావాలి. కృతజ్ఞతా బలులు సమర్పించాలి (కీర్తనలు 95:2; 100:4).

 

3. పవిత్రమైన అలంకారంలో ఆరాధించాలి (కీర్తనలు 29:2). మనలను పరీక్షించుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి, నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి.

 

4. ఆత్మతో మరియు సత్యంతో ఆరాధించాలి (యోహాను 4:23, 24). మన ఆత్మను దేవుని ఆత్మతో ఏకీకృతం చేయాలి, ఆరాధనలో మన ఆలోచనలు చెదరిపోకూడదు.

 

5. భయభక్తులతో దేవున్నీ యోగ్యంగా ఆరాధించాలి (ఇబ్రీయులు 12:28).

 

6. కృతజ్ఞతలతో బహుమతులను మరియు ప్రార్థనలను సమర్పించాలి.

 

7. మనలను నమ్రతతో తక్కువ చేసుకొని, దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఆయనను ఆరాధించటానికి మనం అర్హులం కాదు. మనం విశ్వాసరహితులము, మార్పుల బాటలో ఉన్నవారు. కానీ ఆయన మాత్రం నమ్మకంగా, మార్పు లేకుండా ఉంటాడు.

 

నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించెదను.(కీర్తనలు 43:3- 4)

 

మన ఆరాధన బలిపీఠం వద్ద జ్ఞానముతో ప్రార్థిద్దాం, ఆరాధిద్దాం.

- శ్రీమతి. గీత రిచర్డ్ గారు

 

ప్రార్థన అంశం:

ఈ సంవత్సరంలో మన లక్ష్యాలను సాధించేందుకు మన నాయకుల కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet