Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.01.2025
Share:

By Village Missionary Movement

Thursday, 09-Jan-2025

దిన ధ్యానము(Telugu) 09.01.2025

 

అంశం: నాట్యకారిణి మరియు సువార్తిక

 

"సత్యమందు (మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము" - యోహాను 17:17

 

ప్రిస్కిల్లా అందమైన పదహారేళ్ల నాట్యకారిణి. ఆమె లక్ష్యం ప్రపంచ ప్రసిద్ధ నర్తకి కావడం. ఒక రోజు ఆమె ఒక కల కనింది. ఆ కలలో, ఆమె తన స్నేహితులతో కలసి నృత్యం చేస్తోంది. ఆ గుంపులో ఆమె ఒక పొడుగైన, మహిమతో నిండిన, కాంతివంతమైన వ్యక్తిని చూసింది. అతడు ఆమె దగ్గరకు వచ్చి, "నేను నిన్ను ఎరుగను," అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆ కల వల్ల కలవరపడింది. ఆ పరిస్థితిలో, ఆమె ఒక నగరానికి డాన్స్ ప్రోగ్రాంకు వెళ్లి, ఒక హోటల్ గదిలో నిలిచింది. అక్కడ ఆమె పక్కగదిలో ఉన్న యువతిని కలుసుకుంది. ఆ యువతి యేసుని అంగీకరించినవారు. ప్రిస్కిల్లా తన కలను ఆ యువతికి చెప్పింది. ఆ యువతి ఆశ్చర్యపడి, "ఆ వ్యక్తి యేసు క్రీస్తు," అని చెప్పి, ప్రిస్కిల్లాను రక్షణలోకి నడిపింది.

 

ప్రిస్కిల్లా రక్షణ పొందుతుది. ఆమె నృత్యాన్ని విడిచిపెట్టింది. ఆమె చైనా దేశానికి సువార్తికగా వెళ్ళి, చైనీస్ మిషనరీ సి.టి. స్టడ్‌ను వివాహమాడి, ప్రభువుకు అంకితమైన మంత్రిగా మారింది.

 

ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు క్రీస్తు దగ్గరకు వచ్చింది, ఆయన పరిసయ్యుని ఇంట్లో భోజనమునకు కూర్చుండగా. ఆమె ఆయన పాదముల వద్ద నిలబడి కన్నీటితో ఆ పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, తనకున్న అత్యంత విలువైన సుగంధద్రవ్యంతో అభిషేకించింది. ఆమె తన పాపాలపై గుండెలవిసేలా ఏడ్చింది. ఆమె తన జీవితాన్ని యేసు పాదాల వద్ద ఉంచి, అంతులేని ప్రేమతో ఆ పాదములను ముద్దు పెట్టింది. ఈ ప్రేమను, విశ్వాసాన్ని యేసు గుర్తించి, ఆమెకు శాంతి వాక్యమిచ్చారు: "నీ పాపాలు క్షమించబడినవి. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. 

 

యేసు ఆమె పాపాలను కాదు, ఆమె ప్రేమను, విశ్వాసాన్ని చూశారు. అలాగే ప్రిస్కిల్లా జీవితాన్ని సరిదిద్దాడు. ఆమె వేలాది మందిని ప్రభువువైపు నడిపించింది.

 

మనమూ పరిశీలించుకోవాలి. మన దగ్గర ధూళి వంటి పాపాలున్నాయా? సుగంధద్రవ్యం వంటి పాపాలున్నాయా? యేసు క్రీస్తుపై విశ్వాసం ఉంచి, మన ప్రేమను ఆయనకు అర్పించండి. ఆయన మనకు శాంతిని ఇస్తారు, మనలను ఉపయోగిస్తారు.

- శ్రీమతి. వనజ పాల్‌రాజ్

 

ప్రార్థన అంశం:

దైవ సేవకులను దేవుడు పరిశుద్ధపరచి, సరిదిద్దమని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet