Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.01.2025
Share:

By Village Missionary Movement

Friday, 10-Jan-2025

దిన ధ్యానము(Telugu) 10.01.2025

 

అంశం: గుండెను సరిచేయుట

 

"...దావీదు తన దేవుడైన యెహోవాలో తనను తాను బలపరచుకున్నాడు" – 1 శామూయేలు 30:6

 

కేరీ అనే మహా బైబిల్ అనువాదకుడు బైబిల్‌ను రెండు భాషల్లో పూర్తిగా, కొత్త నిబంధనను 40 భాషల్లో అనువాదం చేయడంలో బాధ్యత వహించాడు. ఆయన 12 కంటే ఎక్కువ భారతీయ భాషలలో బైబిల్ ను అనువదించాడు. ఆయన అనువదించిన ముఖ్యమైన పట్టికలను జాగ్రత్తగా ఒక గదిలో భద్రపరిచాడు. ఇది ఒక రోజులో కానీ రెండు రోజుల్లో కానీ సాధించిన కార్యం కాదు; సంవత్సరాలపాటు కష్టపడి, రాత్రింబవళ్ళు శ్రమించి పొందిన ఫలితాలు. కానీ అనుకోని అగ్నిప్రమాదంలో కొన్ని గంటల్లోనే ఆ పత్రాలన్నీ బూడిదగా మారిపోయాయి. ఎంతటి పెద్ద నష్టం! ఈ అనూహ్యమైన నష్టం ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన హృదయం విరిగిపోయింది. ఈయనే మిషనరీల తండ్రి విలియం కేరీ.

 

దావీదునకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. దావీదును అతని సైన్యాన్ని జిక్లాగ్‌ వద్దకు తిరిగి వచ్చినప్పుడు, అమాలేకీయులు జిక్లాగ్‌ను దోచుకుని, దానిని తగలబెట్టి, దావీదుని మరియు అతని జనుల భార్యలు, కుమారులు, కుమార్తెలను బంధించి తీసుకుపోయారు. దావీదును మరియు అతనితో ఉన్న జనులను ఏడుస్తూ కన్నీళ్లు రావటానికి మరొక వీలులేకపోయింది. దావీదు బహుగా సతమతుడయ్యాడు. అంతే కాకుండా, జనులు అతన్ని రాళ్లతో కొట్టాలని అనుకున్నారు. కానీ దావీదు తన దేవుడైన యెహోవాలో తనను తాను బలపరచుకున్నాడు. దావీదు తన హృదయాన్ని సిద్ధపరచుకుని, ఏవిధంగానైనా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.

 

ప్రియమైన వారలారా! సరిచేయటం అంటే సవరించటం. విలియం కేరీ తన హృదయాన్ని బాగా సిద్ధపరచుకున్నాడు కాబట్టి, విసుగొంది పోకుండా అన్ని అనువాదాలను పూర్తిచేశాడు. అలాగే, దావీదుని హృదయం సిద్ధంగా ఉన్నందువల్ల అతడు తన కోల్పోయినవన్నీ తిరిగి పొందగలిగాడు. సిద్ధం కావటం కష్టం. కానీ ప్రతిరోజూ మనం సిద్ధం అయితే, ప్రతి రోజు మనకు విజయమే. బైబిల్ కూడా చెబుతుంది: మనం మనల్ని పరిశీలించుకొని తెలుసుకుంటే, తీర్పుకు గురి కాకుండా ఉంటాము. కాబట్టి మన హృదయాన్ని, మన పనులను, మనకు జీవమిచ్చిన దేవుని సన్నిధిలో సిద్ధం చేద్దాం.

- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:

ఈ సంవత్సరంలో మన లక్ష్యాలకు చేరుకోవడంలో భాగస్వామ్యం కాబోయే దేవుని పిల్లలను దేవుడు సిద్ధపరచి పవిత్రపరచాలని ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet