By Village Missionary Movement
Monday, 13-Jan-2025దిన ధ్యానము(Telugu) 13.01.2025
అంశం: మీరు ఎప్పుడెప్పుడు ఆరోగ్యవంతులవుతారు?
"కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటి ననుసరించి నడుచుకొనవలెను" - లేవీయకాండము 25:18
ఒక చిలిపి బాలుడు కుర్చీలో ఒక కాలు మడిచి, మరొక కాలు ఊపుతూ కూర్చున్నాడు. ఇది గమనించిన ఒక వృద్ధుడు, "ఏమిటి బాబూ, ఇలా కూర్చోవడం?" అని అడిగాడు. బాలుడు, "మరేంచేయాలి చెప్పండి?" అని ప్రశ్నించాడు. వృద్ధుడు చెప్పాడు, "మంచిగా చదువు." "తర్వాత?" అని బాలుడు అడిగాడు. "పని చేయు," అని ఆయన అన్నాడు. ఆ ఇద్దరి సంభాషణ ఆగకుండా, బాలుడు మళ్ళీ, "తర్వాత?" అని అడిగాడు. వృద్ధుడు చెప్పాడు, "చాలా డబ్బు సంపాదించు, ఇల్లు కట్టించు, కారు కొను," అని వరుసగా చెప్పసాగాడు. "తర్వాత?" అని బాలుడు మరలా అడిగాడు. "తర్వాత కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపవచ్చు," అని వృద్ధుడు అన్నాడు. బాలుడు నవ్వుతూ, "నేనిదే చేస్తున్నాను," అని అన్నాడు.
బాలుడి మాటలు వినడానికి సరదాగా లేదా బాధగా అనిపించవచ్చు. కానీ ఇది ప్రపంచం మనకు చూపిస్తున్న సుఖంగా ఉండే జీవన విధానం. కానీ మీకు తెలుసా, బైబిల్ సుఖంగా ఉండటానికి ఏమి చెప్తుంది? లేవీయకాండము 25:17-19 లో దేవుడు ఇలా అంటాడు: "మీ సహచరులను బాధ పెట్టకండి. దేవునికి భయపడుతూ, ప్రభువు ఆజ్ఞల ప్రకారం న్యాయంగా నడవండి. అప్పుడు మీరు దేశంలో శాంతిగా నివసిస్తారు."
ఓవైపు, నయోమీ అనే వితంతువు తన కోడలైన రూతుతో మాట్లాడుతూ, "నీ దేశానికి తిరిగి వెళ్ళు; నీకు దేవుడు సహాయము చేయను గాక" అని చెప్పింది. కానీ రూతు తన అత్తగారితో, "మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు," అని గట్టిగా పట్టుకొని ఉన్నది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె అవసరాలన్నీ తీర్చాడు. ఆమె బోయాజుతో వివాహం చేసుకొని ఓబేదును కన్నది. దేశంలో శాంతితో ఉండి అనేక ఆశీర్వాదాలను పొందింది. అంతే కాదు, ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది.
అవును, నా ప్రియమైన ప్రజలారా, నేడు మన దేవుడు కూడా మీరు ఈ దేశంలో సంతోషంగా జీవించాలనుకుంటున్నాడు. ఇతరుల పట్ల చెడు ద్వేషించండి, మంచి చేయండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మును ఆశీర్వదిస్తాడు. భౌతిక, ఆత్మీయ ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాడు. మీరు కొరతలను ఎదుర్కోనరు. మీ గిడ్డంగులు నిండిపోతాయి. అబ్రాహాము, యాకోబు, మరియు రూతును విదేశీ దేశంలో ఆశీర్వదించినట్లుగా, మీకును అనేక మంచి విషయాలను చూపించి ఆశీర్వదిస్తాడు.
- సిస్టర్. మంజుల గారు
ప్రార్థనా అంశం:
"ఇనీయవలే" అనే ఆమెన్ విలేజ్ టీవీ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250