By Village Missionary Movement
Tuesday, 28-Jan-2025దిన ధ్యానము(Telugu) 28.01.2025
అంశం: సంకుచిత పరిధి అవసరం లేదు
"దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెర వేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను" - యెషయా 46:11
ఒక చిన్న పాపకు తాను పెంచుకుంటున్న బంగారు చేపలు ఎంతో ఇష్టంగా ఉన్నాయి. కొన్ని రోజులుగా చేపల ట్యాంక్ శుభ్రం చేయలేదు. కాబట్టి, ఆ పని తానే చేయాలని నిర్ణయించి, చేపల్ని పెద్ద నీటి ట్యాంక్‌లో ఉంచింది. ట్యాంక్‌ను శుభ్రం చేసి తిరిగి వచ్చి, పెద్ద నీటి ట్యాంక్‌లో చేపలను గమనించగా, అవి పెద్ద ట్యాంక్‌లో ఉన్నప్పటికీ చిన్న ట్యాంక్‌లో ఉన్నట్లే ఒక చిన్న ప్రాంతం చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉన్నాయి.
మనమూ చాలాసార్లు మనకోసం ఒక చిన్న పరిధిని గీసుకుని అందులోనే జీవిస్తుంటాం. "ఇంతే నాకు సాధ్యం" అని మనమే నిర్ణయించుకుంటాం. కానీ దేవుని సంకల్పం మనకోసం చాలా గొప్పది. ఆయన మనలాగా ఆలోచించడు. ఆయన మన చుట్టూ పెద్ద వలయాన్ని గీస్తాడు. కానీ మనకు ఇప్పుడిదే కనిపిస్తున్న చిన్న భాగమే అనిపించవచ్చు. కానీ ఆయన ఆ వలయమంతా చూస్తాడు.
బైబిల్లో, ప్రభువు మిద్యానీయుల భయంతో వెనకడుగు వేస్తూ బాధపడుతున్న గిద్యోనును పిలిచి అతనికి గొప్ప పనిని అప్పగించాడు. గిద్యోనుతో పెద్ద మిద్యానియుల సమూహాన్ని జయింపజేశాడు. ఆయన సంతానం లేని అబ్రామును "అబ్రాహాము" అని పిలిచి, "అనేక జనములకు తండ్రి" అనే అర్థంతో అతనిని ఆశీర్వదించాడు. ఆయన మాట ప్రకారం ఆ వాక్యాలు నెరవేర్చి, భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాయి.
అలాగే, దేవుడు మన పట్ల కలిగి యున్న యోచనలు కూడా గొప్పవే. "నాకు ఇది చేయడం సాధ్యం కాదు" అని అనుకునే రోజులే చాలు. మన చుట్టూ చిన్న వలయంతో జీవించడమే చాలు. మన కోసం దేవుడు గీసిన పెద్ద వలయంలో జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన కోసం జీవించి, మన వల్ల సాధ్యమైనంత పనిచేద్దాం. ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా!
- శ్రీమతి. ఎస్తేర్ మనోజ్‌కుమార్ గారు
ప్రార్థనా అంశం:
ప్రతి జిల్లా నుండి 300 గిద్యోనులు రావాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250