Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.01.2025
Share:

By Village Missionary Movement

Thursday, 30-Jan-2025

దిన ధ్యానము(Telugu) 30.01.2025

 

అంశం: సువార్త ప్రకటించటానికి భయపడకండి

 

"సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది" - రోమీయులకు 1:16

 

బ్రెజిల్ లో కార్లోస్ అనే వ్యక్తి ఒక లారీ ప్రయాణంలో మటో గ్రాసో అనే ఊరికి వెళ్తుండగా, లారీ డ్రైవర్ అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ కార్లోస్ మౌనంగా ఉండిపోయాడు. ప్రయాణం ముగిసినప్పుడు, లారీ డ్రైవర్ ఒక చిన్న "క్రొత్త నిబంధన" అతనికి ఇచ్చి, "నీకు సమయం దొరికినప్పుడు దయచేసి దీన్ని చదువు" అని చెప్పాడు. కార్లోస్ వెనుకంజ వేస్తూ దానిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 

ఎన్నో నెలల తర్వాత, ఆ లారీ డ్రైవర్ చర్చికి వెళ్లినప్పుడు, కార్లోస్ అక్కడ ఉన్నాడు. "నీవు నన్ను గుర్తుపట్టగలవా?" అని లారీ డ్రైవర్ అడిగాడు. కార్లోస్ ఆనందంతో "నీవు నాకు ఇచ్చిన క్రొత్త నిబంధన స్వీకరించిన రోజు, నేను ఒక మనిషిని హత్య చేయడానికి వెళ్తున్నాను. కానీ అనూహ్యంగా ఎవరో నా చొక్కాను లాగినట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగిచూసినప్పుడు ఎవ్వరూ కనిపించలేదు. నేను ఆశ్చర్యంతో అక్కడ కూర్చున్నాను. కొంతసేపటికి నీవు ఇచ్చిన కొత్త నిబంధన తెరిచి చదివాను. అప్పుడు ఆ వ్యక్తిని హత్య చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపం పొందినవాడిని" అని చెప్పాడు.

 

ప్రియమైన దేవుని బిడ్డా! ఆ లారీ డ్రైవర్ ఇచ్చిన కొత్త నిబంధన వల్ల రెండు ప్రాణాలు రక్షించబడ్డాయి. అతను దానిని ఇవ్వడానికి వెనుకాడి ఉంటే, ఒకరు హంతకుడై ఉండేవాడు, మరొకరు హత్యకు గురయ్యేవారు. కానీ ఒకరు యేసు క్రీస్తులో నిత్యజీవాన్ని పొందారు, మరొకరు ఈ లోకజీవితం పొందారు.

 

కాబట్టి, మనం ఎప్పుడూ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. మనం సిగ్గుపడకూడదు. ఇదే మన బాధ్యత. మనం మన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తే, ప్రభువు తన కార్యాన్ని పూర్తి చేస్తాడు. బైబిలు చెబుతోంది:

 

నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.(యెషయా 55:11)

 

కాబట్టి, మనము వెనుకాడకుండా సువార్త ప్రకటించాలి. కోల్పోయినవారిని ప్రభువునొద్దకు తీసుకురావాలి.

- శ్రీమతి ప్రిస్కిల్లా తియోఫిలస్ గారు

 

ప్రార్థన అంశం:

"మోక్ష ప్రయాణం" అనే మాసపత్రిక ద్వారా ప్రాథమిక విశ్వాసుల జీవితం అభివృద్ధి చెందాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban holiganbet setrabet marsbahis giriş vaycasino giriş