Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.03.2025 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 02-Mar-2025

దిన ధ్యానము(Telugu) 02.03.2025 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

అంశం: వేటగాడు వస్తాడు.

 

"మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు" - 1 పేతురు 5:8

 

హాయ్ పిల్లలు! మీరందరూ కొంగను చూశారా? అవును, అది చేపలు తినడానికి చెరువు మరియు సరస్సు వద్దకు వస్తుంది. గ ఎంత అందంగా మరియు అద్భుతంగా ఉందో మీరు చూశారా? చేపను చూసిన వెంటనే దాన్ని పట్టుకుని తింటుంది. ఈరోజు మనం కొంగ కథ విందామా?

 

ఒక అందమైన నది ఒడ్డున చాలా కొంగలు నివసించేవి. కొంగలను పట్టుకోవడానికి ఒక వేటగాడు వచ్చాడు. ఈ కొంగలు అన్నింటినీ చూచి తుపాకీతో గాలిలోకి కాల్చాడు. తుపాకీ శబ్దం విని కొన్ని కొంగలు వేగంగా ఎగిరిపోయాయి. అయితే చేపల కోసం తహతహలాడిన కొంగలు.. వచ్చే ప్రమాదాన్ని గ్రహించక వేటగాడికి బలైపోయాయి. కొన్ని కొంగలు మంచి చేపలు దొరికాయని, అలాగే తప్పించుకోవలసి వచ్చి నేలపై పడి నటించసాగాయి . వేటగాడి యొక్క పనివాడు చనిపోయిన కొంగలను సేకరించి ఒక సంచిలో ఉంచాడు. అప్పుడు వేటగాడు ఏం చెప్పాడో తెలుసా? చనిపోయిన వాటిని వదిలేయండి, అవి ఎక్కడికి పోవు, దెబ్బతగిలి సగం బతికి ఉన్న ఆ కొంగలను పట్టుకోండి. అవి తప్పించు కొనుటకు ప్రయత్నిస్తున్నాయి అని ఆయన అన్నారు. జాగ్రత్తగా ఉన్న కొంగలు ఎగిరి పారిపోయాయి.

 

అదే విధంగా, వేటగాడు ప్రతిరోజూ కొంగలను వేటాడేవాడు. చూడండి, నా చిన్నపిల్లలారా! సాతాను మనల్ని తన ఉచ్చుులో పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉంటే మనం కూడా తప్పించుకోవచ్చు. “కాసేపు సెల్ ఫోన్ చూసు కోవడం, చిన్న అబద్ధం చెప్పడం, చెడ్డ మాటలు మాట్లాడడం అనే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మనం సాతాను వలలో చిక్కుకుని అతని బానిసలుగా మారతాము.

 

చూడండి, నా చిన్న పిల్లలారా, పాపం యొక్క భయానకతను మనం గ్రహిస్తే, మనం ఎగిరిపోయి సాతాను నుండి తప్పించుకోగలము. పవిత్రత గురించి పట్టించుకోకుండా పాపంలో ఉన్నవారిని సాతాను పట్టించుకోదు. అవి చనిపోయిన కొంగలు లాంటివి! అయితే పాపం అని తెలిసినా రెండు మనసులతో జీవించే వారే అతని టార్గెట్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనుకుంటే, యేసును ప్రార్థించండి. ఆయన మాటను పాటించండి. ఓ.కె. రండి మనం ఎక్కడున్నామో అక్కడే కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. ప్రియమైన యేసు, సాతాను ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు దయచేసి నాకు కృప ఇవ్వండి. నీ మాటను పాటించగల మంచి హృదయాన్ని నాకు ప్రసాదించండి, ఆమేన్.

- సిస్టర్. డెబోరా గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino