By Village Missionary Movement
Saturday, 07-Jun-2025దిన ధ్యానము(Telugu) 07.06.2025
అంశం: కోపాన్ని నివారించండి
"నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను" - యాకోబు 1:19
ఒక తండ్రి తన కొత్త కారును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో కారు క్లీన్ చేస్తున్నట్టు నటిస్తూ అతని మూడేళ్ల కూతురు కారు దగ్గర నిలబడి ఉంది. కొద్దిసేపటికి, ఆమె ఒక చిన్న రాయిని అందుకుని కారుపై ఏదో గీసింది. ఇది చూసిన తండ్రి ఆగ్రహానికి గురై పక్కనే ఉన్న కర్ర తీసుకుని చిన్నారి చేతిని బలంగా కొట్టాడు. ఆమె చేతికి రక్తం ఎక్కువగా కారడంతో కంగారుపడిన తండ్రి చిన్నారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూడగా చిన్నారి చేతిలో ఎముక విరిగిపోయింది. గుండెలు బాదుకుని కన్నీళ్లతో చిన్నారిని కౌగిలించుకుని క్షమాపణలు చెప్పాడు. ఆ పాప వెంటనే తండ్రిని కారు దగ్గరకు తీసుకెళ్ళి, "నాన్న, ఐ లవ్ యూ సో మచ్" అని రాసి ఉన్న దానిని చూపించింది. దానిని చూసిన తండ్రి గుండె పగిలింది. తొందరపాటు మరియు కోపం యొక్క చర్య ఎలా ముగిసిందో మీకు తెలుసా?
ఆదాము మరియు హవ్వ కుమారులైన కయీను మరియు హేబెలు గురించి చెప్పబడింది. కయీను మరియు హేబెల్ దేవునికి ఆర్పణ సమర్పించడానికి వచ్చారు. కయీను భూమి పంటను యెహోవాకు ఆర్పణగా తెచ్చాడు. హేబేలు తన మందలోని మొదటి సంతానం నుండి క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చాడు. ప్రభువు హేబేలును మరియు అతని అర్పణను అంగీకరించాడు కానీ కయీను మరియు అతని అర్పణను అంగీకరించలేదు. కయీను చాలా కోపంగా ఉన్నాడు మరియు అతని ముఖం చిన్న బుచ్చుకుంది. అప్పుడు ప్రభువు కయీనును ఇలా అడిగాడు, "నీకు ఎందుకు కోపం వచ్చింది? నీ ముఖ చిన్న బుచ్చుకొనుట ఎలా?" నీవు సత్క్రియ చేసిన యెడల తలను ఎత్తుకొనవ? నీవు సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచివుంది అన్నారు. దేవుడు కయీనును శపించాడు. ఎఫెసీయులకు 4:26లో, అపొస్తులుడైన పౌలు ఇలా అంటున్నాడు, “కోపపడుడి గాని పాపం చేయకుడి” కోపం నశ్వరమైనదని సామెతలలో రాజైన సొలొమోను హెచ్చరించాడు. ఐదు నిమిషాల కోపానికి మన జీవితమంతా ఖర్చవుతుంది. కాబట్టి మనం వినడానికి త్వరగా, మాట్లాడడానికి నిదానంగా, కోపానికి నిదానంగా ఉందాం. దేవుని ఆశీర్వాదం పొందుతాం.
- శ్రీమతి. షీలా జాన్ గారు
ప్రార్థన అంశం :
"ఇనియావాలే" మహిళా పరిచర్య కార్యక్రమం ద్వారా అనేకమంది స్త్రీలు క్రీస్తు కొరకు జీవించేలా ప్రేరేపించబడాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250