Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.06.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 13-Jun-2021

దిన ధ్యానము(Telugu) 13.06.2021 (Kids Special)

 

"మీరు లోకమునకు వెలుగైయున్నారు" - మత్తయి 5: 14

 

మాల, కళ, శాంతి ముగ్గురు కూడా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో చదువుతున్న విద్యార్థినులు. వీరిలో కళ, మాల ఇద్దరు కూడా మంచి స్నేహితురాళ్లు, అంత మాత్రమే కాదు బాగా అల్లరి చేసే పిల్లలు. ఎప్పుడు చూసిన ఎవరినో ఒకరిని హేళన చేస్తూ ఉంటారు, కాని శాంతి అయితే మిక్కిలి నెమ్మది గలిగిన అమ్మాయి మరియు తల్లిదండ్రులు మాటకు లోబడే పిల్ల. ఎప్పుడు ఇతరులకు మాదిరి కరమైన జీవితం ఉండాలి అని మంచిగా జీవిస్తుంది. ఈమె యొక్క మంచి నడవడికను చూసిన అనేక మంది పిల్లలు ఈమె వలె ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 

ఒక దినము మాల యొక్క అమ్మ చేతులో బకెట్టుతో విధి అంత మాల మాల అని పిలుస్తూ వెతుకుతూ చివరికి తన ఇంటి పక్కనే ఉన్న తోటలోకి వచ్చారు. అక్కడ మాల కథల పుస్తకం చదువుతూ ఉంది. అమ్మ యొక్క స్వరం వినగానే తనకి కోపం వచ్చి వేగంగా వచ్చి ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని అడిగింది కాని ఆమె తల్లి అయితే ప్రశాంతంగా తన చేతిలో బకెట్ ఆమెకి ఇచ్చి దీనిలో ఉన్న బియ్యంను షాప్ కి తీసుకివెళ్లి పిండి ఆడించుకొనిరా అని చెప్పారు. వెంటనే మాల నేను వెళ్ళాను నేను చదవాలి అన్నది. వెంటనే మాల యొక్క అమ్మ నితో చదువుతున్న శాంతి కూడా ఇప్పుడే ఒక బకెట్ తీసుకొని రైస్ మిల్లుకు వెళ్లింది అన్నారు. వెంటనే మాల ఎప్పుడు నన్ను ఇతరులతో పోల్చకూ అన్నది. నేను వెళ్లి పిండి ఆడించుకొని వస్తాను అని చెప్పి వెళ్ళింది. మారుసటి దినము ఎప్పుడు లాగానే స్కూలుకి వెళ్లారు. లెక్కలు క్లాస్ అయిన వెంటనే టీచర్ ఎవరైనా వచ్చి ఈ లెక్కను బోర్డ్ మీద రాయండి అన్నారు. విద్యార్థులు అందరూ కూడా ఒకరి మొఖం ఒకరు చూస్తూ ఉండి పోయారు. శాంతి అయితే మనస్సులు ప్రార్థన చేసుకొని ప్రయత్నించి చూస్తాను అని తలంచి బోర్డ్ దగ్గరకు వెళ్లి రాయడం మొదలు పెట్టింది. అంత చక్కగానే చేసింది అది చూసిన టీచర్ శాంతిని కొనియాడుతూ మీరు కూడా ఈమె వలె ధైర్యం గల పిల్లగా ఉండాలి అని అన్నారు. శాంతిని పొగిడిన దానిని తట్టుకోలేని మాల, కళ యొక్క మనస్సులో చాలా ద్వేషం కలిగింది. అయినప్పటికీ క్లాస్ అయిపోయిన వెంటనే శాంతి యొద్దకు వెళ్లి నీవు ఎలా అందరి దగ్గర మంచి పేరు పొందుకుంటున్నావ్ అని అడిగారు. అందుకు శాంతి నవ్విన మోకముతో యేసయ్య మనలో ఉంటే ఎలాంటి మంచి స్వభావము అయిన వచేస్తాది. నేను వెళ్తున్న సండేస్కూల్లో ఇంకా అనేకమైన కార్యములను నేర్పిస్తారు మీరు కూడా వస్తారా అని అడిగింది. అందుకు వాళ్ళు మేము కూడా కచ్చితంగా వస్తాము అన్నారు. ప్రియ తమ్ముడు, చెల్లి నీవు కూడా ఈ శాంతి వలె మాదిరి కరమైన జీవితం జీవించాలి సరేనా! 

- శ్రీమతి. శారల్ శుభాస్

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş