Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.02.2026
Share:

By Village Missionary Movement

Friday, 27-Feb-2026

దిన ధ్యానము(Telugu) 27.02.2026

 

అంశం: మార్పు నా నుండే మొదలవ్వాలి

 

“అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు” - సామెతలు 23:7

 

ఒక పాస్టర్ గారు ఆదివారం ఉదయకాల ఆరాధన కోసం తన ప్రసంగ అంశాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆ సమయంలో, ఆయన చిన్న కుమారుడు ఆయనను మాటిమాటికీ ఇబ్బంది పెడుతున్నాడు. అబ్బాయికి ఏదైనా పని చెబితేనే తన పని పూర్తి చేసుకోగలనని ఆ పాస్టర్ భావించారు. అప్పుడు ఆయన పక్కనే ఉన్న టేబుల్ మీద ఒక ప్రపంచ పటం (World Map) కనిపించింది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది! ఆయన ఆ పటాన్ని తీసుకుని, వేర్వేరు ముక్కలుగా కత్తిరించి, ఒక బాక్సులో వేసి తన కొడుకుకి ఇచ్చారు. "నాన్నా, ఈ ముక్కలన్నింటినీ సరిగ్గా అమర్చి, పూర్తి ప్రపంచ పటాన్ని తీసుకురా" అని చెప్పారు. తన కొడుకు ఆ పటాన్ని పూర్తి చేసేలోపు, తాను ప్రసంగం సిద్ధం చేసుకోవచ్చని ఆయన అనుకున్నారు.

 

కానీ ఆశ్చర్యకరంగా, ఆ అబ్బాయి ఆలస్యం చేయకుండా కేవలం మూడు నిమిషాల్లోనే ఆ పటాన్ని సరిగ్గా అమర్చి తన తండ్రికి చూపించాడు. తన కొడుకు తెలివితేటలకు ఒకవైపు సంతోషించినా, తన పని ఇంకా పూర్తి కాలేదని ఆ పాస్టర్ కంగారుపడ్డారు. పక్కనే నిలబడిన కొడుకును చూసి, "దీన్ని ఇంత త్వరగా ఎలా పూర్తి చేశావు?" అని అడిగారు. దానికి ఆ అబ్బాయి, "ఇది పెద్ద విషయం కాదు నాన్నా.. ఆ పటం వెనుక ఒక మనుష్యుని చిత్రం ఉంది. నేను ఆ మనిషిని సరిగ్గా అమర్చాను, అప్పుడు ప్రపంచ పటం కూడా దానంతట అదే సరిగ్గా సెట్ అయిపోయింది" అని చెప్పాడు.

 

ఆ మాట విన్న పాస్టర్ ఆశ్చర్యపోయారు. దేవుడు తన కుమారుని ద్వారా తనతో మాట్లాడుతున్నారని ఆయన గ్రహించారు. మరుసటి రోజు ఆయన చర్చిలో ఇలా ప్రసంగించారు: "వ్యక్తులుగా మనం ముందు మనల్ని మనం సరిదిద్దుకున్నప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది." బైబిల్ ఇలా చెబుతోంది: "ఒకడు తన నోటి ఫలమును బట్టి శుభము ననుభవించును" (సామెతలు 13:2). చాలా సార్లు మనం మన పరిస్థితులను, మన చుట్టూ ఉన్న వ్యక్తులను మార్చడానికి ప్రయత్నిస్తుంటాం. సమస్యకు పరిష్కారం బయట ఎక్కడో ఉందని వెతుకుతాం. కానీ అసలైన పరిష్కారం మనలోనే, మనల్ని మనం మార్చుకోవడంలోనే ఉంది. ముఖ్యంగా, మన ఆలోచనలను మరియు మన మాటలను దైవవాక్యానికి అనుగుణంగా మార్చుకుంటే, అస్తవ్యస్తంగా ఉన్న మన జీవితం కూడా సాఫీగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని కృపతో దీనిని ప్రయత్నిద్దామా?

 

ప్రార్థన అంశం:-

అన్ని తాలూకాల్లో నిర్వహించబడే బాలల శిబిరాల (Children's Camps) కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort