Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.02.2026
Share:

By Village Missionary Movement

Saturday, 28-Feb-2026

దిన ధ్యానము(Telugu) 28.02.2026

 

అంశం:అలసిపోవద్దు!

 

"వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను" - లూకా 18:1

 

మనలో చాలా మందికి ప్రార్థనా యోధుడైన జార్జ్ ముల్లర్ గురించి తెలిసే ఉంటుంది. ఆయన తన మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా, తన ఇద్దరు స్నేహితులు మారుమనస్సు పొంది, యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలని ఆయన చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. జార్జ్ ముల్లర్ పట్టు వదలని ప్రార్థనను దేవుడు ఆలకించారు. ఆయన మరణించకముందే వారిలో ఒకరు ప్రభువును అంగీకరించారు. ముల్లర్ మరణించిన కొన్ని నెలల తర్వాత, మరో స్నేహితుడు కూడా ప్రభువును తన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాడు. వారు మారుమనస్సు పొందాలని జార్జ్ ముల్లర్ ఏకంగా 53 ఏళ్లు ప్రార్థించారు. చూడండి, ఆయన విసుకక చేసిన ప్రార్థనకు ఫలితం దక్కింది.

 

నేటి బైబిల్ భాగంలో, ఒక న్యాయాధిపతి దగ్గరకు వెళ్లి, "నా ప్రత్యర్థికిని నాకును న్యాయము తీర్చుము" అని వేడుకున్న ఒక విధవరాలి గురించి మనం చదువుతాము. చాలా కాలం వరకు ఆ న్యాయాధిపతి ఆమె విన్నపాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఆయన తనలో తాను ఇలా అనుకున్నాడు, "ఈ విధవరాలు నన్ను మాటిమాటికీ తొందరపెట్టుచున్నది గనుక, ఆమె పదే పదే వచ్చి నన్ను విసిగించకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చుదును." అప్పుడు యేసు ఇలా అన్నారు, "దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?"

 

ప్రియ స్నేహితులారా! మనం మనుషులం కాబట్టి అలసట, నిరాశ మనందరికీ రావచ్చు. ముఖ్యంగా ప్రార్థనలో అలసిపోవడం సహజం. అలసిపోని ప్రాణి ఏదీ లేదని కూడా చెప్పవచ్చు. గొప్ప ప్రవక్త అయిన ఏలీయా కూడా ఒకానొక సమయంలో అలసిపోలేదా? మనం ఎప్పుడు అలసిపోయినా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడదాం. మనలో చాలామంది ప్రార్థనకు జవాబు రానప్పుడు నిరుత్సాహపడి ప్రార్థన చేయడం మానేస్తుంటారు. అంతేకాదు, కొన్నిసార్లు ప్రార్థించడమే మర్చిపోతుంటాం. ఆలస్యమైనా సరే, యేసు నిశ్చయంగా మనకు సమాధానం ఇస్తారు. కాబట్టి మనం ఎప్పుడు నిరుత్సాహపడినా, ఆత్మపై ఆధారపడి, నూతన బలము పొంది, ప్రార్థనలో పోరాడి విజయం సాధిద్దాం.

- సిస్టర్. మెర్సీ గారు 

 

ప్రార్థన అంశం:-

చిన్నారుల క్యాంప్‌ల ద్వారా మనం కలుసుకున్న పిల్లలు, యేసు కోసం ధైర్యంగా సాక్షులుగా నిలబడేలా ప్రార్థించండి..

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş cratosroyalbet realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet betgit radissonbet grandpashabet romabet nesinecasino grandpashabet