Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.04.2026
Share:

By Village Missionary Movement

Monday, 13-Apr-2026

దిన ధ్యానము(Telugu) 13.04.2026

 

అంశం: ఆయన సమస్తమును నెరవేర్చును

 

“యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును...” - కీర్తనలు 138:8

 

పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వద్ద పనిచేసే ఒక శాస్త్రవేత్త, ఒకరోజు సాయంత్రం 5:30 గంటలకు కార్యాలయం నుండి వెళ్లడానికి అనుమతి కోరారు. దానికి కారణం అడగ్గా, "నా పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్తానని మాట ఇచ్చాను" అని ఆ శాస్త్రవేత్త చెప్పారు. కలాం గారు అనుమతించారు. ఆ శాస్త్రవేత్త తిరిగి తన పనిలో నిమగ్నమయ్యారు. పని ఒత్తిడిలో ఆయన సమయాన్ని మర్చిపోయారు. తీరా పని ముగించుకుని చూసేసరికి రాత్రి 8:30 అయ్యింది. పిల్లలకు ఏం సమాధానం చెప్పాలా అని కంగారుగా ఇంటికి వెళ్లారు.

 

అక్కడ పిల్లలు కనిపించలేదు. తన భార్యను అడగ్గా, స్వయంగా అబ్దుల్ కలాం గారే వచ్చి పిల్లలను ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లారని ఆమె చెప్పింది. ఆ శాస్త్రవేత్త తన పనిలో పూర్తి నిమగ్నమై ఉన్నందున, ఆయన పై అధికారి అయిన కలాం గారే స్వయంగా ఆ బాధ్యతను నెరవేర్చారు. అదేవిధంగా బైబిల్లో, దానియేలు మరియు అతని స్నేహితులు రాజు భుజించు ఆహారమును పుచ్చుకొని తమను తాము అపవిత్రం చేసుకోకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. వారు ఈ విషయం గురించి అధిపతితో మాట్లాడినప్పుడు, దేవుడు వారికి కటాక్షమును, దయను అనుగ్రహించారు. పది రోజుల తర్వాత, రాజు భోజనము తిన్న వారందరికంటే వీరి ముఖములు కలకలలాడుచు, శరీరములు బలిష్ఠముగా ఉండటం అందరూ గమనించారు. ఆ సమయానికి వారికి అవసరమైన జ్ఞానమును, సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చారు. వారు దీని కోసం ప్రత్యేకంగా ప్రార్థించకపోయినా, దేవుడు దానిని పదింతలు పెంచి అనుగ్రహించారు. మన దేవుడు తన శక్తి సామర్థ్యాల చొప్పున ఇస్తారు కానీ, నరుల కొలత ప్రకారం ఇవ్వరు.

 

ప్రియ స్నేహితులారా, దేవుని శక్తి చొప్పున మనం పొందుకోవాలంటే, మనకు సాధ్యమైనంత వరకు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ప్రయత్నిద్దాం. మనం దేవుని కోసం పనిచేసినప్పుడు, ఆయన మన అవసరాలను తీర్చడానికి సమర్థుడు. "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడు అవన్నియు మీకు అనుగ్రహింపబడును." (మత్తయి 6:33).

- బ్రదర్. స్టాలిన్ రాజా గారు

 

ప్రార్థన అంశం:

ప్రతి తాలూకాలో గృహ ప్రార్థన కూటములను నడిపించడానికి "అకులా మరియు ప్రిస్కిల్ల" వంటి వారు లేపబడాలని దయచేసి ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet