Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.06.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 23-Jun-2021

దిన ధ్యానము(Telugu) 23.06.2021

 

"పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను" - ద్వితియోపదేశకాండము 32:11

 

చాలా కఠినమైన ఉన్నతమైన శికరము పైన పక్షి రాజు యొక్క గూటిలో రెండు పక్షి రాజు పిల్లలు తమ శరీరాలను ముడుచుకొని పడుకున్నాయి. తల్లి పక్షిరాజు తమ పిల్లలకు అవసరమైన మాంసపు ఆహారాన్ని వెతుకుతూ తెచ్చి వాటికి ఇస్తూ ఉండేవి. చల్లని రాత్రి కాలపు సమయంలో తల్లి పక్షి తన పిల్లలపైన రెక్కలు చాపి హత్తుకొనేది. తల్లి యొక్క శరీరపు వేడి, మృదువైన రెక్కలు పిల్లలకు మంచి నిద్రను ఇస్తూ ఉండేది. ఆ పక్షిరాజు పిల్లలవలె నూతనంగా దేవునిలో జన్మించిన, రక్షించబడిన పిల్లలు కూడా ఉంటున్నారు. క్రైస్తవులుగా ఉండే ఏ సమస్య ఇక రాదు అని తలంచుచున్నారు.

 

ఒక దినము తల్లి పక్షిరాజు తన యొక్క బలమైన రెక్కలతో ఎగురుతూ వచ్చి భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఎప్పుడు ప్రశాంతంగా గుడులో కూర్చునే పక్షి ఈ దినము తన గూటికి నోటితో పొడుస్తూ పెరికివేయడం ప్రారంభించింది. మరల మరల అదే పని చేస్తూ ఉంది. తాను ఇప్పటి వరకు సంరక్షించిన అ గుడులో కొంచం మాత్రమే మిగిలి ఉంది. దాంట్లో కూర్చొని ఉన్న పిల్లలు ఆగాధమైన స్థలమును చూచి వనికిపోవడం ప్రారంభించాయి. తల్లి పక్షి తన పిల్లల్లో ఒక దానిని తీసి అగాదమైన స్థలములోనికి త్రోసి వేసింది. దీనిని ఎదురు చూడని ఆ పిల్లలు ఈ రోజు మేము అయిపోయాము అనుకుంటూ క్రింద పడిపోతుంటే క్షణంలో తల్లి ఎగురుతూ వచ్చి దానిని విపుపైన మోసుకొని వెళ్ళింది. మరల కొండ శికరము పైకి తీసుకువెళ్లి మరల క్రింద పడేసింది. ఎందుకంటే అవి మేఘముల పైన ఎగిరే పక్షి రాజుల ఎగరడానికి వాటికి తర్ఫీదు ఇస్తూ ఉండేది.

 

ప్రియమైన వారలారా మనలను కూడా శ్రేష్ఠమైన వాళ్లుగా నిలవబెట్టుటకు దేవుడు చేపడుతున్న విధానం కూడా ఇదే. జీవితంలో మనలను ఇబ్బంది పెడుతున్న సమస్యలను చూచి పక్షి రాజు పిల్లలు కేక వేస్తున్నట్లు మనం కూడా కేక వేస్తున్నాం. గాని మిమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్న దేవుడే మీ గూడును చెదరగొడుతున్నారు అనే దాన్ని గ్రహించండి. ఆత్మీయ ఉన్నత అనుభవాలను మనము నేర్చుకొని ఉన్నత శిఖరము వైపు రెక్కలు చాపి ఎగురుట నేర్పించుటకే దేవుడు ఆశిస్తున్నారు.

 

దేవుడు ఇప్పుడు మీకు తర్ఫీదు ఇస్తున్నారా? ఇంకా కొంచ కాలంలో శ్రేష్ఠమైన వారిగా ఎలాంటి సత్క్రియను చేయుటకు అర్హత కలిగిన పాత్రగా మారిపోతారు. హల్లెలయా!

- శ్రీమతి. ధవమని వైరవేల్

 

ప్రార్థన అంశం:-

ఈ పరిచర్యను ప్రార్ధనతోను, సహయంతోను బలపరుస్తున్న పాట్నర్స్ ని దేవుడు ఇంకను ప్రార్థన ఆత్మతోను, విజ్ఞాపన ఆత్మతోను నింపేటట్లు ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort