Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.06.2021
Share:

By Village Missionary Movement

Monday, 28-Jun-2021

దిన ధ్యానము(Telugu) 28.06.2021

 

"పాపము మీద విజయము "

 

"పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము" - రోమీయులకు 6: 23

 

జాన్ బ్రట్ బోర్డ్ ప్రభువు కొరకు సాక్షిగా మరణించిన వ్యక్తి. ఆయన ఒక దినములో రాత్రి 4 గంటలు మాత్రమే నిద్రిస్తారు అంట. ఆయన ఆహారము కూడా తక్కువగానే తీసుకుంటారు. మిగిలిన సమయాన్ని బైబిల్ చదువుటకు, ధ్యానించుటకు, ప్రార్ధించుటకు, ఇతరులకు ప్రభువును ప్రకటించుటకు, మేలు చేయుటకే సమయాన్ని కేటాయించే వారు. ఈయన పాపము గురించి ప్రజలకు మృదువుగాను అదే సమయంలో ఖచ్చితంగా గద్దించి హెచ్చరించేవారు. ఎందుకంటే ప్రజలు దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని పోరాడేవారు. జాన్ బ్రట్ బోర్డ్ ఆత్మీయ జీవితం చాలా లోతైనదిగా ఉండేది. తన అనుదిన పాపపు కార్యములను ఒక పేపర్ మీద వ్రాసి దాన్ని తన వ్యక్తిగత ప్రార్ధనలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి పాపాన్ని దేవుని యొద్ద సమర్పించి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ క్షమాపణ అడుగుట ఆయనకు గల అలవాటు. అలా చేస్తూ తన రక్షణ జీవితాన్ని ప్రతి రోజు నూతన పరచుకోనేవారు. 

 

ఈయన తన జీవితంలో గ్రహించిన ముఖ్యమైన కార్యం పాపము యొక్క జీతం మరణం. అది చాలా భయం కరమైనది. పాపము దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెంపివేస్తుంది. దేవుడు లేని జీవితం ఎందుకు అన్నదే ఆయన యొక్క తలంపు. అపోస్తులుడైన పౌలు పాపము గురించి దాని మూలం గురించి అనేక కార్యములు చెబుతున్నారు. కోరుకున్న వాటిని చేయకుండా దానిని వ్యతిరేకిస్తు న్న కార్యములనే చేస్తున్నాను. నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే అలా చేస్తుంది ఆని పాపము గురించి దాని యొక్క క్రియల గురించి వివరిస్తున్నారు. 

 

ప్రియమైన వారలారా! మనము పాపముతో అనుదినము పోరాడుతూనే ఉన్నాం దాంట్లో మనము బానిసలుగా ఉండి పోకుండ దాంట్లోనుండి తప్పించబడాలి అంటే జాన్ బ్రట్ బోర్డ్ వలె మనము బైబిల్ చదువుట, ప్రార్ధించుట, మేలుచేయుట అనే కార్యంలో ముందు ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను దీవిస్తారు. ఆమెన్.

- బ్రదర్. పి. స్టీవ్ మ్యాత్యూ 

 

ప్రార్థన అంశం:

మనము నడిపించే యవ్వనస్తులు, చిన్నారులు దేవుని యొద్ద నుండి వెనక బడిపోకుండ దేవునిలో నిలిచి యుండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet betplay jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet