Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.07.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 04-Jul-2021

దిన ధ్యానము(Telugu) 04.07.2021 (Kids Special)

 

కొండమీద జరిగిన అద్భుతం.

 

"దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" - 2కోరింథీయులకు 9:7

 

అది ఒక అరణ్య ప్రదేశం. అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు కూర్చుని మిక్కిలి ఆశక్తితో యేసుక్రీస్తు యొక్క ప్రసంగం వింటువున్నారు. అక్కడ ఉన్న ఒక చిన్న కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు కూర్చొని వారి మీద కనికరపడి వారితో మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా అల్లరి చెయ్యకుండ యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన మాటలను వింటున్నారు. సమయం అవుతుండగా అందరికి ఆకలి వేయడం ప్రారంభించింది. చిన్న పిల్లలు నెమ్మదిగా ఏడవడం ప్రారంభించారు. యేసయ్య తన శిష్యులలో ఒకరైన ఫిలిప్పును పిలిచి వీరందరికి ఆహారం పెట్టాలి కాబట్టి రొట్టెలను ఎక్కడైనా కొందామా అని అడిగారు. అందుకు ఫిలిప్పు ప్రభువా 5000 మందికి పైగా ప్రజలు ఉన్నారు. ఇరునూరు దేనారములకు అనగా ఇంచుమించు 106 రూపాయలకు రొట్టెలను కొనినను సరిపోవు అని చెప్పాడు ఫిలిప్పు. అప్పుడు సమూహము మధ్యలో ఉన్న అంద్రెయ ఒక చిన్న బాలుడ్ని యేసయ్య యొద్దకు తీసుకువచ్చి ఈ బాలుని యొద్ద 5రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. ఆ బాలుడు రెండు టిఫిన్ బాక్స్ లతో వచ్చి యేసయ్యకు ఇచ్చాడు. కూడి ఉన్న ప్రజలు నెమ్మదిగా తమ పిల్లల చెవిలో ఏదో చెప్పారు. ఒక అమ్మ తన కుమారుడితో నీ దగ్గర ఉంటే నీవు ఇస్తావా చూడు ఆ బాబు ఎంత మంచి వాడో అని అన్నది. కాని ఇది 5000 మందికి సరిపోతుందా? సరిపోదుకదా అని ఆలోచిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలను చేతిలోకి తీసుకొని ఆకాశము వైపు కన్నులు ఎత్తి ప్రార్థన చేసి వాటిని శిష్యులకు ఇచ్చి అందరిని పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టి ఈ ఆహారాన్ని పంచి పెట్టండి అన్నారు. శిష్యులు అలానే చేశారు. అయితే ఏమిటి ఈ ఆశ్చర్యం గంపలో నుండి తీస్తున్న కొలది రొట్టెలు మరియు చేపలు వస్తూనే వున్నాయి. చేపలను ఇష్టపడే వారు వాటిని బాగా తిన్నారు. అందరూ తినేసాక మిగిలిన వాటిని 12 గంపలు నిండుగా ఎత్తారు. ఆ చిన్న పిల్లాడిని చూచిన వారు అందరూ తన చెయ్యి పట్టుకొని పొగిడారు. కొంత మంది తన బుగ్గలు పట్టుకొని ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. కొంత మంది తండ్రి లాంటివారు బుజము తట్టి వెరీ గుడ్ అని చెప్పారు. నీ కొరకు ఒకటి కూడా ఉంచు కోకుండా అన్నింటిని ఇవ్వడానికి నీకు మనస్సు ఎలా వచ్చింది అని ప్రతి ఒక్కరు తనను మెచ్చుకున్నారు. 

 

చిన్న పిల్లలారా మీరు యేసయ్యకు ఇవ్వవచ్చు. దేనిని ఎలా, ఎక్కడ, ఇవ్వాలి. అని అడుగుతున్నారా? ఒక మట్టి హుండీని కొని దానిలో మీ అమ్మానాన్న ఇచ్చిన డబ్బులను దాచి వాటిని మనకంటే కష్టపడే వాళ్లకు, చదువుకోలేని వాళ్లకు ఇవ్వవచ్చు. అది మాత్రమే కాదు మీ ఊరికి సేవచెయ్యడానికి వచ్చే సేవకునికి ఇచ్చి సేవలో వాటిని ఉపయోగించమని చెప్పవచ్చు. కొంచం డబ్బులే కదా వీటిని ఎలా ఇవ్వాలి అని ఆలోచించ వద్దు. 5 రొట్టెలు, 2 చేపలే కదా అందరికి ఎలా సరిపోతుంది అని ఆ చిన్న బాలుడు ఆలోచించలేదు. యేసయ్య చేతికి ఇస్తే అది ఆశీర్వదింప బడుతుంది. ఏంటి హుండీ కొనడానికి రెడినా?

- శ్రీమతి. జీవ విజయ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet