Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Saturday, 31-Jul-2021

దిన ధ్యానము(Telugu) 31.07.2021 (Bible Characters Special)

 

నెహెమ్యా:-

 

"ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని" - నెహెమ్యా 1:4

 

ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి చెడు మరల మరల చేస్తూ ఉండటం వలన దేవుడు వారిని అన్యజనుల చేతికి అప్పగించారు. వారు బందింపబడి తీసుకొని వెల్లబడ్డారు. చెరసాలలో ఉన్నవారు బహు శ్రమను అనుభవించారు. యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోయబడినది. ఆ రోజుల్లో యూదా గోత్రానికి చెందిన నెహెమ్యా అనే యవ్వనుడు బందింపబడి పరసికా దేశపు రాజైన అర్తహషస్త యొక్క సుసాన్ కోటలో రాజునకు గిన్నె అందించు వాడై యున్నాడు. అప్పుడు యూదుల లోనుండి వచ్చిన నెహెమ్యా యూదుల యొక్క పరిస్థితి గురించి, యెరూషలేము పరిస్థితి గురించి అడిగాడు. వారు యూదులు అనుభవిస్తున్న మహా శ్రమలు గురించి, మరియు ప్రకారం పడద్రోయబడి మండుతున్న దానిని గురించి చెప్పారు. ఇది విన్న నెహెమ్యా కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి బిగ్గరగా ప్రార్ధించాడు. రాజు యొద్ద తన విజ్ఞాపన తెలియ పరిచి అతని యొద్ద సెలవు పొందుకొని యెరూషలేము ప్రాకారములను చాలా ఆటంకములు దాటి 52 రోజుల్లో కట్టి పూర్తి చేశాడు. 

 

గడిచిన రోజుల్లో మన భారతదేశ పరిస్థితి ప్రశ్నర్థకంగా ఉండేది. నీతి న్యాయములు కాలిపోయినట్లు కనిపించాయి. రహస్యములు ప్రారంభమైనాయి. నిజాయితీకి విరుద్ధమైన వార్తలు విన్నాము అనే నిజాన్ని నమ్మలేకపోయాం. కాని పరిస్థితిని విచారిస్తునే ఉన్నాం. వార్త పత్రికలు, టి.వి, సామాజిక వెబ్సైట్లు ద్వారా మనుష్యుల భవనలను, అధికారం యొక్క ఆధిపత్యాన్ని రెప్ప వేయకుండా చూస్తూనే ఉండేవాళ్ళం. ఇలా అనేకమైన వార్తలను తెలుసుకొని మనలో ఎంత మంది నెహెమ్యా వంటి హృదయంతో ప్రార్ధించాము. దేవుడు మన జనులకు క్షేమాన్ని ఇచ్చేలా మన పాపములు అన్ని విడిచిపెట్టి దేవుని యొద్ద పోరాడమా? 

 

ప్రియమైన వారలారా! ఆశీర్వాదమైన మన భారత దేశం అభివృద్ధి చెందుటకు దేవుని యొక్క పిల్లల భాగం చాలా అవసరం. భద్రత అనే ప్రాకారం కట్టబడాలి అంటే మనము వేగముగా పనిని చెయ్యాలి దేవుని జనులకు వచ్చే కీడుకోరకు ఎస్తేరు వలె ఉపవాసం ఉండి ప్రార్ధించాలి. అవును ఇటువంటి సమయంలో సహాయంగా ఉండటానికి దేవుడు మనలను ఏర్పర్చుకున్నారు. అందువలన మనం ఎల్లప్పుడూ స్తుతులతో కూడిన విన్నపాన్ని దేవుని సన్నిదిలో తెలియజేస్తూనే కొనసాగుదాం. మన ఒకేఒక లక్ష్యం ప్రభువు రెండవ రాకడకు మనం నివసిస్తున్న భారత దేశము సిద్ధపరచాలి అనేదే. ఈ భారం మనకు ఉంటే దేశము యొక్క పరిస్థితి కొరకు అశక్తితో ప్రార్ధించకుండా ఉండలేము. 

- బ్రదర్. జె. పౌలు రాజ్

 

ప్రార్థన అంశం:-

మోక్ష పయనం, దినధ్యాన పత్రికలను ముద్రించుటకు అవసరమైన ఆవసరతలు సందించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet matbet giriş holiganbet holiganbet güncel holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet grandpashabet holiganbet grandpashabet grandpashabet grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet grandpashabet grandpashabet casinolevant grandpashabet meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş