By Village Missionary Movement
Friday, 06-Aug-2021దిన ధ్యానము(Telugu) 06.08.2021
టాటా బైబై.
"మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును" - యోహాను 14:18
ఈనాటి ప్రపంచంలో ఉన్న సంబందాలను గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. మిక్కిలి సమాధానంగా ఒక బంధమునకు టాటా బైబై అని చెబుతున్నారు. ప్రత్యేకంగా పురుషులను నమ్మి మోసపోయిన స్త్రీలు, అలాగే స్త్రీలను నమ్మి మోసపోయిన పురుషులే అధికం. జీవితంలో చివరి వరకు కలిసి ఉంటాను అని చెబుతారు కానీ మధ్యలో టాటా చెప్పి విడిచి వెళ్ళిపోతారు. అందులోను ఈరోజుల్లో సమూహ వెబ్సైట్లు నకిలీ ఖాతాలను ప్రారంభించి ఆశ కలిగించే మాటలు మాట్లాడి వారి పని పూర్తి అయిన వెంటనే బైబై అని చెబుతున్నారు. ఇటువంటి పనులనుండి మనం మనలను, మన సంతానములను కాపాడుకోవాలి.
పరిశుద్ధ గ్రంధంలో యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన జీవిత కాలం పూర్తి అయినప్పుడు ఆయన శిష్యులకు టాటా చెప్పి విడిచి వెళ్లిపోలేదు. బదులుగా ఎప్పటికి దగ్గరే ఉండు లాగున పరిశుద్ధాత్ముని మన కొరకు పంపించారు. యేసుక్రీస్తు ప్రభువు తాను చెప్పినట్లే తండ్రి యొద్దకు వెళ్లి పరిశుద్ధాత్ముని మన కొరకు పంపించారు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సకల సత్యము లోనికి అను దినము మనలను నడిపిస్తున్నారు.
ఇది వింటున్న స్నేహితులరా యేసుక్రీస్తు వలె ఈ భూమిలో ఎవరు మనలను ప్రేమించ లేరు. ఆయన మనలను మధ్య దారిలో విడిచిపెట్టి టాటా బైబై అని చెప్పె వారు కాదు. ప్రభువైన యేసుకు మనకు ఉన్న సంబంధం గురించి ఆలోచించి మనము ఉత్సాహ పడాలి. దానికి గల కారణం ఆయన మనతో ఈ భూమి మీద జీవించే జీవితంలో మాత్రమే కాదు పరలోక రాజ్యానికి చేరు వరకు మనతో ఉండి మనలను నడిపిస్తారు. అందువలన మనము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను మనలను త్రోసివేయకుండా చేరదీసుకొని నడిపించే వారు యేసుక్రీస్తు మాత్రమే. అందువలన ఆయన పైన అనుకోని జీవిద్దాం.
- బ్రదర్. టి.శంకర్
ప్రార్థన అంశం:-
త్రాగుడుకు బానిసైన ప్రజలు విడుదల పొందుటకు ప్రారంభించబడిన పీస్ సెంటర్ కొరకు ప్రార్ధించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250