Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

అనుదిన ధ్యానము:-09-08-2021
Share:

By Village Missionary Movement

Monday, 09-Aug-2021

అనుదిన ధ్యానము:-09-08-2021

మార్పు లేని పిలుపు.

“ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు”. (రోమీయులకు 11: 29)

అమెరికాలో ఉన్న న్యూ జెరుషాలేములో 1270వ సంవత్సరమున చిన్న నౌక ఒకటి సముద్రంలో రాయిని ఢీకొని ప్రమాదమునకు గురైంది. దాని వలన చాలా మంది మరణించారు. ప్రాణాలు దక్కించుకున్న కొంత మందిలో ‘మరే’ అనే బోధకుడు ఒకరు. అందులో తన భార్య పిల్లలు అందరూ మరణించారు. ఒక ధివికి తీరం చేరిన అతను ఆ దుర్ఘటనను మరచిపోలేక పోయాడు. నేను ఇలా ఒంటరిగా మారుటకు ప్రభువే కారణం అని ప్రభువును తిరస్కరించి ఆ కొత్త దీవిలో జీవించి రోజులు గడుపుతూ ఎప్పటి లాగే జీవించాలి అని అనుకున్నారు.

మరుసటి రోజున తన మన్సులో చాలా గందరగోళంతో నిండిన వాడై నడుచుకుంటూ వీధిలో వెళ్తున్నప్పుడు ఒక మనుష్యుడు ఎదురు పడ్డాడు. అతడు ఆ సేవకుడ్ని చూసి మికొరకే ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. వెంటనే నేను నీకు తెలుసా అని ఆ సేవకుడు అడిగాడు. అయ్యా యేసయ్యను గూర్చి నేను కొంచెం తెలుసుకొని ఉన్నాను. నా భార్య దేవుని మాటలను చదివి నాకు చెబుతుంది. మా ఇంటిలోనే కూడి. ప్రభువును ఆరాధిస్తున్నాం. కాని పరిశుద్ద గ్రంధం ను బోధించుట, ప్రసంగించుటకు ఎవరు లేరు. కాబట్టి మాతోనే నివాసం ఉంటూ సేవచేసే బోధకుడ్ని ఇవ్వండి అని చాలా రోజులుగా ప్రార్థిస్తూ వస్తున్నాం. రెండు రోజులకు ముందు మా సభలో ఒకనికి నౌక ప్రమాదంలో తప్పించుకొని మనుగడ కొనసాగిస్తున్న వ్యక్తిని మీకు సేవకునిగా పంపించాను అని ప్రభువు బయలపరిచారు. అదేవిధంగా మీరు వచ్చారు అన్నారు. మరే అనే ఆ బోధకుడు ప్రభువు యొక్క ప్రణాలికను గ్రహించి అక్కడనే నివాసం ఉండి పనిచేశారు. తనకు వచ్చిన శ్రమలు, సమస్యల కారణంగా ఈ దేవుని యొక్క పిలుపును ఆ శ్రమల కాలంలో అర్థం చేసుకోలేక పోయారు. కాని వారి మధ్యలో దేవుడు ఆయనను పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండి సేవను నెరవేర్చారు.

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన జీవితంలో కూడా యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత శ్రమలు, కష్టాలు, నష్టాలు రావచ్చు కాని అవి ఏవి కూడా దేవునికి తెలియకుండా రావడం లేదు. కృప ద్వారా మన అందరిని దేవుడే ఏర్పరచుకొని పిలిచారు. అయితే మన జీవితంలో మన పరిస్థితులను చూసి వెనుదిరగవచ్చు. కాని మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన యొక్క ప్రేమ ఎన్నడూ మారనిది. ఆయన యొక్క పిలుపులో నిలకడగా ఉందాం. సమస్తమును ఆయన మేలు కొరకే జరిగిస్తారు.

శ్రీమతి. శక్తి శంకర్ రాజ్

ప్రార్థన అంశం:-

లాక్ డౌన్ కారణంగా పాఠశాలలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్న పిల్లల యొక్క సంరక్షణ మరియు భవిష్యత్తు కొరకు ప్రార్ధించండి.

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250

 

 

 

 

 

 

 

 

 

 



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort