By Village Missionary Movement
Thursday, 12-Aug-2021దిన ధ్యానము(Telugu) 12.08.2021
అంశం: కటాక్షము.
"బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును" - కీర్తనలు 41:1
సి.ఎం.ఎస్ అమ్మ అని పిలవబడే ఇంగ్రిడ్ కౌస్కి గారు జర్మనీ నుండి ఇండియాకు వచ్చారు. ఈమె సి.ఏం.ఎస్ ను స్థాపించిన డాక్టర్ హాట్స్ కౌస్కి యొక్క భార్య. అనాథల కొరకు మరియు ఆదరణ లేని పిల్లల కొరకు నిర్వహించే ఒక దాతృత్వమే సి.ఏం.ఎస్. ఈమె ఎప్పుడు పేద, మధ్యతరగతి ఆదరణ లేని మరియు అనాధ పిల్లల యొక్క అవసరతలు తీర్చుటకును వారిని కలుసుకోనుటకును ఆమెను సమర్పించుకున్నారు. ఈ పిల్లలకు భోజనం మరియు వస్త్రాలు అందిస్తూ స్థానిక పాఠశాలల మూలముగా విద్యను బోధించారు. ఆధ్యాత్మిక జీవితం కొరకు సండే స్కూల్ ను నిర్వహించేవారు. ఒక చిన్నవాడు వ్యాధిగ్రస్తుడై ఉన్నారు అప్పుడు ఇంగ్రిడ్ గారు ఆ పిల్ల వాడిని సంరక్షించుటలోనే తన సమయం అంత గడిపారు. ఇంకా ఆ చిన్నవాడు వాంతి చేసినప్పుడు ఇంగ్రిడ్ కౌస్కి గారు ఆ వాంతిని చేతులతో ఎత్తారు. వానిని శుభ్రపరచి తన రుమాలుతో వాడిని తుడిచి కౌగలించుకొన్నారు. బీదల పై వారికి ఉన్న కటాక్షమే ఈరోజు వరకు మనం వారిని గుర్తు చేసుకొనుటకు కారణం అయింది.
యేసుక్రీస్తు యెరికో పట్టణముకు వెళ్లినప్పుడు అనేక మంది ఆయనతో వెళ్లారు. అప్పుడు ద్వారం దగ్గర కూర్చొని ఉన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు ప్రభువా దావీదు కుమారుడా మమ్ములను కరుణించుము అని పిలిచారు. వారు యేసు వైపు చూసి పిలిచినప్పుడు జనులు వారిని చిన్న చూపు చూసి గద్దించారు. కాని యేసుక్రీస్తు వానిని పిలిచి రమ్మని చెప్పి వారితో మాట్లాడారు. నేను మీకు ఏం చెయ్యాలి అని అడిగారు. యేసుక్రీస్తుకు వారు చూపును పొందుకోవాలి అని ఆశపడుతున్నారు అని తెలుసు అయిన వారితో మాట్లాడి వారి ఆశను నెరవేర్చారు.
ప్రియమైన వారలారా! నేను కూడా బీద స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను అని తలంచుతున్నారా? నా పరిస్థితిని ఎవరితో చెప్పాలి? ఎవరు నాకు సహాయం చేస్తారు అని అనుకుంటున్నారా? మీకు సహాయపడే ఏకైక వ్యక్తి అయిన యేసుక్రీస్తు ఉన్నారు. మీ పిలుపుకు ఆయన చెవి యొగ్గి ఆయన సహాయం చేస్తారు మరచిపోవద్దు. అదే సమయంలో నమ్మకంగా ఉండే ఆయన పిల్లలైన మనం బీదవారం అని ఆలోచించ కుండా ఉందామా. బీదలను కలుద్దాం పరమతండ్రి పిల్లల వలె ధన్యులై ఉందాం.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్.
ప్రార్థన అంశం:-
మన మోక్ష ప్రయానం, దిన ధ్యాన సందేశాలు 8 బాషలలో పంపించుటకు సహాయం చేస్తూ వస్తున్నా భాష అనువాదకులను దేవుడు ఆశీర్వదించే లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250