Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.09.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 14-Sep-2021

దిన ధ్యానము(Telugu) 14.09.2021

 

అంశం:- తుమ్మ చెట్టు.

 

"మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను" - నిర్గమకాండము 37:1

 

తుమ్మచెట్టు ఇశ్రాయేలీయుల దేశంలో కనిపించే ఒక రకమైన చెట్టు. ఈ చెట్టు యొక్క అన్ని భాగములు ముల్లులతో నిండి ఉంటుంది. గాలి వేసినప్పుడల్లా ఆ చెట్టు కదిలి ముల్లులు గుచ్చి ఆ చెట్టుకు గాయం ఏర్పడి జిగురు కారుతుంటుంది. ఆ చెట్టు ఉండేది ఎడారి ప్రాంతం. నీరు లేక పోరాడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాని ముల్లులు ఆ చెట్టును గుచ్చి గాయపరచుట వలన నీరు బయటకు వస్తుంది. ఇలా నీరు అంత బయటకు వస్తున్నప్పుడు ఆ చెట్టు తనను బిగించుకోవడం ప్రారంభిస్తుంది. చివరికి బిగించుకొని చెట్టు బలముగా మారి ఆ ముల్లులు రాలిపోతాయి. ఈ చెట్టు ద్వారా తయారుచేసిన వస్తువులు సుమారు 4000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. ఎవరికి అవసరం లేని ఉపయోగ పడని ముల్లు చెట్టును కూడా మన దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకున్నారు. నిర్గమకాండం 25:8 లో పరిశుద్ద గ్రంధంలో వ్రాయబడిన మందసము, మోత కర్రలు, బద్దె, బల్లెము వంటి చెక్క.పనులు అన్ని ఈ చెట్టుతోనే తయారు చేయబడినవి. దేవుడు పరిశుద్ద స్థలం కొరకు ఇవ్వమని చెప్పిన కానుకలలో తుమ్మ కర్ర ఒకటి. 

 

ఇదేవిధంగా పరిశుద్ద గ్రంధంలో మార్కు సువార్త 5:5లో తనకు తానే రాళ్లతో గాయపరచు కొనుచు అనేక దయ్యములు చేత పట్టబడిన వానిని యేసుక్రీస్తు వెతుకుతు వచ్చారు. అతనిలో ఉన్న వేలకొలది దయ్యములను వెళ్లగొట్టారు. అతను దుస్తులు ధరించుకొని ఆయన వెంబడి వస్తాను అని చెప్పి నప్పుడు యేసు నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములు అన్నింటిని తెలియ జేయుము అని చెప్పి పంపించేశారు. లుకా సువార్త 8:39 ద్వారా వాడు వెళ్ళి యేసుక్రీస్తు తనకు ఎట్టి గొప్ప కార్యములు చేసేనో ఆ పట్టణము అంత ప్రకటించెను. అంతవరకు యేసుని వెంబడించని ఆ గ్రామస్తులు వాని సాక్ష్యం వినిన తరువాత యేసు కొరకు ఎదురు చూస్తూ సంతోషంగా యేసును అంగీకరించారు. జీవితంలో దీర్ఘకాలంగా ఏర్పడిన గాయముల వలన మీలో ఎవరైనా కృంగిపోయారా? తుమ్మ అనే ముండ్ల చెట్టును మరవకుండా తన యొక్క గొప్ప పనికొరకు ఉపయోగించు కున్నారు. అదేవిధంగా తనకు తానే గాయపరచుకొంటు సమాధులలో ఉంటున్న వ్యక్తిని కూడా ప్రభువు స్వస్థత పరిచారు. అతనిని కూడా తన నామ మహిమర్థముగా వినియోగించారు. ఆ మంచి దేవుడు గాయపడిన మీ హృదయమును కూడ ఖచ్చితంగా ఓదార్చి ఆయనే గాయమును కట్టి మీ బాధను తొలగించి సంతోషంగా జీవింప చేస్తారు. ఆమెన్.

- శ్రీమతి. మంజుల

 

ప్రార్థన అంశం:-

మన యొక్క మీడియా పరిచర్యలో పని చేయుటకు సామర్ధ్యం కలిగిన సమర్పించు కొన్న సేవకులు దొరికేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet esbet sonbahis tambet grandpashabet betgit mercurecasino