Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.09.2021
Share:

By Village Missionary Movement

Thursday, 16-Sep-2021

దిన ధ్యానము(Telugu) 16.09.2021

 

అంశం:- వ్యత్యాసం అయిన నాయకత్వం.

 

"రాబోవు వాడవు నీవేనా, మేము మరియొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను" - మత్తయి 11: 2-3

 

కన్వెన్షన్ సమావేశంలో ఒక బోధకుడు ప్రసంగం చేస్తు సేవ అయిన సరే కుటుంబం అయిన సరే వైరోగ్యాలు ప్రాముఖ్యం అని మాట్లాడారు. కొత్తగా రక్షించబడిన నాకు ఇది వ్యత్యాసంగా ఉండేది. కుటుంబం అయిన సేవ అయిన ఒక విషయంలో ఒకే విధముగా ఉండాలి. ఇదేంటి కొత్త ఉపదేశం అనే ఆలోచన నాలో కలిగింది. ప్రభువు మార్గము సిద్ధపరుచుడి అని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం అయిన యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తును గూర్చి చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడతారు. అదే యోహాను మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తును గూర్చి తడబడుతూ మాట్లాడుతున్నారు. వారికి నాయకునిగా ఉన్న యేసుని గూర్చి సందేహం, అర్థం చేసుకొనక పోవుట వలన ఏర్పడిన మాటలు, ఆలోచనలలో తడబడుతున్నారు. చెరసాలలో ఉన్న యేసును తాను కలుసుకొనలేదు. విడుదల చేయుటకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు అనేది యోహాను యొక్క ఆలోచనగా ఉండి ఉండవచ్చు. అనేక పనులలో మనం ఆశపడునట్లు కొన్ని సమయాలు ఉండవు. 

 

ఒక కుటుంబంలో 5గురు ఉంటే ఆ ఐదుగురు ఒకే విధంగా ఆలోచించారు, ఒకే విధంగా నడుచుకొరు. కుటుంబంలో ఉన్న నాయకత్వపు కార్యకలపాలను అంగీకరించుటకు మనస్సు ఉండదు. అదే విధముగా నాయకత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచం కఠినముగానే ఉంటుంది. దీనిలో ప్రఖ్యాత ఏమిటి అంటే కొన్ని సమయాల్లో పరిశుద్ద గ్రంథ వాక్యాలు మనకు వ్యత్యాసంగా అనిపిస్తాయి. ఉదాహరణకు ఏశావు, యాకోబు గురించి దేవుడు నడిపించే విధానం రోమియులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10-16 వచనములలో చూడండి. పరిశుద్ద గ్రంధం చెబుతున్న వార్త ప్రకారం అర్థం చేసుకొనుట అనేది విశ్వాసంలో లోబడి ఉండుటలోనే ఉన్నది దేవుని దీవెనలు, పరిశుద్ద గ్రంధం మచ్చలేనిది అని మనం విశ్వసించినప్పుడే దానిలో వ్యత్యాసం లేదు అని మనము అర్థం చేసుకోగలము. 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:

ఒడిశాలో గుమ్మా ప్రాంతంలో నూతనంగా పరిచర్య ప్రారంభించ బడుటకు, కొత్త సేవకులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet