Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.09.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 26-Sep-2021

దిన ధ్యానము(Telugu) 26.09.2021 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం:-

 

"పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది" - కొలస్సీయులకు 3:20

 

పింకి, జింకి అనే రెండు కోతి పిల్లలు తన అమ్మతో కలిసి ఒకే చెట్టులో నివసిస్తూ వస్తున్నాయి. ఆ చెట్టు సమీపంలో ఒక కొలనుకూడా ఉండేది. ఆ కొలనులో మొసలి తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. అప్పటికప్పుడు ఈ పింకి జింకి కలిసి ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని ఆ కొమ్మనుంచి ఈ కొమ్మకు ఊయల ఊగుతూ సంతోషముగా జీవిస్తూ వస్తున్నాయ్ ఇలా ప్రతిరోజూ చూస్తున్న మొసలి ఈ కోతి పిల్లలను ఎలా అయినా క్రిందికి రప్పించి మోసం చేసి తినేయాలి అని ఆశ కలిగింది. ఒకరోజు తల్లి కోతి, కోతి పిల్లల యొద్ద నేను ఆహారం కోసం బయటకు వెళ్తున్నాను మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి చెట్టు నుండి కిందకు దిగకూడదు సరేనా అని అన్నది. అది విన్న కోతి పిల్లలు కూడా సరే అమ్మ అని అన్నాయి. అది అంతా వింటున్న మొసలి కి చాలా సంతోషం కలిగింది. 

 

ఇదే ఈ కోతి పిల్లలను తినుటకు సరైన సమయం అనుకొని కొలను నుండి బయటకువచ్చి చెట్టును చూసి హే! పింకి,జింకి ఎలా ఉన్నారు? అని చిన్న స్వరముతో అవునూ! మీకు ఈ చెట్టు మీదే గెంతుతూ ఆడుతూ ఉండటం మీకు బోరు కొట్టలేదా? నన్ను చూడండి ఎంత జాలీగా నీటిలో ఈత కొడుతూ జాలీగా స్నానం చేస్తున్నానో అని మీకు అలాంటి ఆశాలేద అని అడిగింది. వెంటనే జింకి నాకు కూడా నీటిలో ఈత కొడుతూ స్నానం చేయాలని ఆశ ఉంది అని చెప్పింది. వెంటనే మొసలి మన మందరం స్నేహితులముగా ఉందాం అని రా! జింకి నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని అన్నది. జింకి కూడా నీటిలో స్నానం చేయాలి అని ఆశతో గబగబా చెట్టునుంచి కిందికి దిగి వెళ్ళిపోయింది. పింకి- హే ! జింకి క్రిందకు దిగవద్దు ఆ మొసలి నిన్ను చంపేస్తుంది అని నువ్వు ఈ చెట్టుపై వేలాడుతూ ఉండు అని చెప్తున్నా జింకి వినకుండా మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. జింకి, పింకీతో నువ్వు ఈ చెట్టుపై వేలాడుతూ యందు నేను ఈ మొసలి వెళ్లి నీటిలో స్నానం చేసి ఈత కొడతాను అని చెప్పి మొసలి వీపుపై ఎక్కి వెళ్ళిపోయింది. జింకి మొసలి పై ఎక్కి పింకి కి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. మొసలి సగం నీటిలో వెళ్ళిన తరువాత కోతితో నేను నిన్ను స్నానం చేయించుటకు కాదు నేను నిన్ను చంపి తినుటకు తీసుకు వచ్చాను అని చెప్పింది. జింకి స్నేహితుడా వద్దు నను విడిచి పెట్టు అని బ్రతిమిలాడింది. అంతలో మొసలి ఆ కోతిని చంపి తినేసింది. ఇది అంతా చూస్తున్న పింకి ఇలా లోబడకుండా తన ప్రాణమును కోల్పోయింది అని చాలా బాధపడుతూ ఏడ్చింది. 

 

చిన్న తమ్ముడు, చెల్లి ఈ మొసలి వలె సైతాను కూడా మీ స్నేహితుల ద్వారా నీ దగ్గర చాలా సున్నితంగా మాట్లాడి నిన్ను మోసం చేసి యేసుని నుండి విడదీయాలని చూస్తాడు. నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి.నీ తల్లిదండ్రుల మాటలు విని అలాగే వారికి లోబడాలి ఓకేనా! సరే పిల్లలు మనం ఒక కంఠత వాక్యం కూడా నేర్చుకుందామా!  

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet