Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.09.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 29-Sep-2021

దిన ధ్యానము(Telugu) 29.09.2021

 

అంశం:- తల్లిదండ్రుల గమనిక.

 

"అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనుము" - తీతుకు 2:7

 

ఒక కళాశాలలో పేద కుటుంబానికి చెందిన ఇద్దరు సహోదరులు చదువుకున్నారు. అన్నయ్య చదువులో శ్రద్ధ చూపించకుండా త్రాగుడు అలవాటు చేసుకొని బానిసగా మారిపోయాడు. ఇంటిలో ఉన్న వారిని ఎదిరించి డబ్బులు తీసుకొని త్రాగడమే తన పని. కాని తమ్ముడు మాత్రం చదువులో ఉత్సహంగాను కళాశాలలో గౌరవము పొందుకొనేవాడిగా ఉండేవాడు. అయితే ఆ కళాశాల ప్రొఫెసర్ కు ఆశ్చర్యం వేసింది. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరికి ఇంత భిన్నమా. తమ్ముడు మంచివాడిలా, అన్నయ్య ఊరినే అవమానపరిచే చెడ్డవాడిగా ఉన్నాడు అని. ప్రొఫెసర్ ఇద్దరిని పిలిచి నీ ప్రవర్తనకు ఎవరు కారణం అని అడిగినప్పుడు ఇద్దరు కూడా ఒకే జవాబును చెప్పారు. నా ప్రవర్తన, నడవడికకు గల కారణం మా నాన్న అని. నాన్న ఏం చేశారు అని అన్నయ్యకు అడిగినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటినుండి రాత్రి పగలు త్రాగుతు నేను అనుభవించే దెబ్బలకు కరువేలేదు కాబట్టి ఆయన బిడ్డగా జన్మించిన నేను త్రాగుబోతుగా మారిపోయను అన్నాడు. తమ్ముడిని అడిగినప్పుడు ఇదే జవాబును చెప్పాడు భయంకరమైన స్వభావము కలిగిన తండ్రి బిడ్డనైనా నేను చెడ్డవాడిగా అయిపోకూడదు అని అనుకున్నాను. నా ప్రవర్తనకు పూర్తి కారణం మా నాన్న అన్నాడు. 

 

ప్రియమైన తల్లిదండ్రులారా! మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? మనం చదివిన దాని బట్టి బిడ్డల ముందు ఎలా జీవిస్తున్నారు? మీ పిల్లలు మిమ్మల్ని చూసే కదా పెరుగుతున్నారు. మీ నడవడిక ఎలా ఉన్నదో అలానే మీ పిల్లలు కూడా ఉంటారు. మీ పిల్లల యొద్ద పక్షపాతం చూపిస్తున్నారా? అది చాలా తప్పు. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నసరే వారిని సరిసమానంగా చుచుకొనుట మీ బాధ్యత. మీ పిల్లల ఎదుట చేదు క్రియల కొరకు కాదు సత్ క్రియల కొరకు మాదిరిగా ఉండండి. అలాగే బ్రతకాలి అని పిల్లలకు నేర్పించండి. ఇందును బట్టి దైవభక్తి గల సంతతిని పొందుకొనగలరు. అందువలన తల్లిదండ్రులారా మీ పిల్లలను ఏ మార్గంలో నడిపించబోతున్నారు. మీ పిల్లలకు మంచి మార్గంలో నడిపించండి దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించును గాక! 

- శ్రీమతి. ఎస్తేర్ గాంధీ

 

ప్రార్థన అంశం:-

మన రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజ్ చదువుతున్న విద్యార్థుల కొరకు, వారు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking perabet casibom holiganbet galabet casibom perabet perabet giriş padişahbet padişahbet giriş grandpashabet kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet casinomilyon jojobet palacebet sonbahis tambet grandpashabet betgit mercurecasino matbet