By Village Missionary Movement
Friday, 01-Oct-2021దిన ధ్యానము(Telugu) 01.10.2021
అంశం:- అమ్మ యొక్క ఆలోచన.
“నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము” - సామెతలు 1:8
క్లిన్ కన్నింగ్ హోమ్ అనే చిన్నవాడికి తండ్రి లేడు. తల్లి కౌగిట్లో పెరుగుతూ వచ్చాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే, విశ్వసించు వాడు కలవర పడడు అనే వాక్యములను చిన్న వయసులోనే తన మనస్సులో బలముగా నాటేల చేశారు తన తల్లి. క్లిన్ కు ఒలింపిక్ ఫూట్ బాల్ ఛాంపియన్ అవ్వాలి అని ఆశ. అందని పండ్ల కోసం ఆశపడవద్దు అని తన తల్లి చెప్పకుండా దేవుని యందు విశ్వాసముంచు ఆయనకు ఇష్టమైనది నీవు చేయగలిగిన మంచి పనులు నువ్వు చెయ్యు అప్పడు దేవుడు ని హృదయ వాంఛ తిరుస్తారు అన్నారు.
ఐర్లాండ్ లో గల చిన్న గ్రామంలో ఒక పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉన్నాడు క్లిన్. పేద విద్యార్థులు మాత్రమే ఆ బడిలో చదువుతారు. చలికి తట్టుకొనే సరైనా ఆటలు లేకపోవడం వలన వారి తరగతి గదిలో వణుకుతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ ముగిసిన వెంటనే క్లిన్ ఎండిన కర్రలు ఏరి ఒక ప్లాస్టిక్ కవరులో వేసుకొని ఉదయమునే తొందరగా తయారు అయ్యి 7 గంటల లోపే పాఠశాలకు వెళ్ళి మధ్యలో కర్రలను ముట్టించి ఆ చిన్న పాఠశాలను వేడిగా మారేలా చేస్తాడు. అందులో ఉన్న పేద విద్యార్థులు సంతోష పడుట తనకు ఎంతో మనస్సు తృప్తిని ఇస్తుంది. అలానే ప్రతి రోజు ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు తెలుపుతాడు.
ఒక రోజు మంటను వెలిగించాడు. వేకువజామున లేవడం వలన అలసటతో బెంచి పైన పడుకున్నాడు. గాలి వేయడం వలన డోర్ కర్టెన్ కు అగ్గి అంటుకుంది. అది క్లిన్ కాళ్ళకు తగలడం వలన క్లిన్ నడవలేక పోయాడు. వీల్ చైర్ లో పాఠశాలకు వచ్చేవాడు. రెండు నెలలు తరువాత దేవుని యొద్ద ప్రార్ధించి విశ్వాసంతో కుర్చీనుండి దిగి గోడను పట్టుకొని కాళ్ళు వణుకుతున్న సరే నిలబడ్డాడు. తరువాత ఒక వారం లోపు వుతాపట్టుకొని నడిచేసాడు. తన అమ్మచెప్పిన మాట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే మాట చెప్పి చెప్పి బాగా ప్రయత్నం చేసినా తరువాత ఒలింపిక్ ఫూట్ బాల్ పోటీలో పాలు పొందుకొని 2గోల్స్ ను వేసి ఛాంపియన్ గా మారాడు.
ప్రియమైన వారలారా ప్రపంచమే ఆశ్చర్యంగా చూసేలా క్లిన్ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి గల కారణం చిన్న వయస్సులో తల్లి నేర్పించిన పాఠం, విశ్వాసపు మాటలు, దేవునికి ప్రియముగా నడుచుకొనుటయే. అవును మన జీవితం ఆశీర్వదించబడుటకు, ఉన్నత స్థాయికి చేరుటకు కన్న వారి మాటలకు లోబడుటయే చాలా ముఖ్యమైనది. దీనిని చదువుతున్న మనం కన్నవారి మాటలకు చెవియొగ్గి ఆశీర్వదాకరముగా జీవిద్దాం.
- శ్రీమతి. జాస్మిన్
ప్రార్థన అంశం:
ఈ నెల అంత చేయబోతున్న సేవ పరిచర్యలో దేవుని హస్తం తోడై ఉండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250