Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.10.2021
Share:

By Village Missionary Movement

Saturday, 02-Oct-2021

దిన ధ్యానము(Telugu) 01.10.2021

 

అంశం:- చెత్త బండి.

 

"తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును" - సామెతలు 11: 12

 

ఒకసారి ఫిలిప్ అద్దె టాక్సీ లో తన ప్రయాణం ప్రారంభించి నప్పుడు బండి సరైన మార్గంలో వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక నలుపు రంగు కారు వేగంగా అడ్డంగా వచ్చింది. ఫిలిప్ యొక్క కారు డ్రైవర్ నిదానంగా బండిని నడిపి క్షణాల్లో ప్రమాదం నుండి తప్పించారు. కాని నలుపు రంగు కారులో ఉన్న వ్యక్తి మాత్రం డ్రైవర్ ను చూస్తూ తిట్టడం ప్రారంభించారు. కానీ డ్రైవర్ మాత్రం చిన్నగా నవ్వుతూ చేతులను ఎత్తిచూపించి తన యొక్క మార్గంలో వెళ్లడం మొదలు పెట్టాడు. ఫిలిప్ తన డ్రైవర్ తో ఎందుకు అతనిని మాములుగా వదిలేశారు అని అతనిని చూస్తే నాకే రక్తం వేడెక్కింది అని ప్రశ్నలను ఆడిగినప్పుడు ఆ డ్రైవర్ ఇలా అన్నారు అనేక మంది ప్రజలు చెత్తను తీసుకు వెళ్తున్న లారీల వలె ఉన్నారు. వారి యొక్క హృదయం అంత అనేకమైన మోసాలు, కోపములతో కనిపిస్తున్నాయి. చెత్త బండి ఏదైనా ఒక స్థలములో ఆ చెత్తను పారవేసినట్లు వీరు కూడా ఆ చెత్తను మోస్తూ ఎవరి యొద్ద వెయ్యలి అని ఎదురుచూస్తు కొన్ని సమయాల్లో మన మీద పారవేస్తారు. అయితే ఆ చెత్తను మోసుకుంటూ వెళ్ళి ఇంట్లో లేదా ఆఫీస్ వంటి స్థలల్లో చూపించ కూడదు. ఆ చెత్తను ఆ సమయంలోనే మరచి విడిచిపెట్టుట అనేది మంచిది అని చెప్పారు. 

 

దావీదు రాజు యొక్క జనులు, బలాఢ్యులు అందరూ నడుస్తూ వచ్చినప్పుడు సౌలు యొక్క కుటుంబస్తుడు అయిన షిమీ దావీదును రాజుగా అంగీకరించుటకు ఇష్టం లేక అతనిని దూషిస్తూ రాళ్లు రువ్వుచు మట్టిని పోస్తూ వచ్చాడు. దావీదు పక్షమున ఉన్నవారు కోపపడి వాడి తలను ఛేదించి వచ్చెదనని అడిగిన దానికి వాడు దూషిస్తే దూషించని యెహోవా సెలవు ఇయ్యక పోతే ఏమియు జరగదు అని దేనిని మనస్సులో ఉంచుకొనక చెప్పాడు దావీదు. 

 

ఎన్నో సార్లు మనం పనిచేసస్తున్న స్థలాల్లో ఇటువంటి వాటిని విని బాధపడుతున్నాము. నేను ఒక తప్పు కూడా చేయలేదు కాని నా గురించి చెడ్డగా చెబుతున్నారు అని రాత్రి అంత నిద్ర పోకుండా దానిని గుర్తు చేసుకుంటు ఉంటున్నాం. ఆ డ్రైవర్ చెప్పినట్లు తమ యొక్క చెత్తను ఎవరి మీద పారవేయాలి అని వేతుకుతున్నప్పుడు మనం దొరుకుతున్నాం. కలతను విడువండి ఇది మీకు మాత్రమే ఎదురయ్యే వ్యక్తి గత అనుభవం కాదు. తన పొరుగువాడిని తృణీకరించు వాడు బుద్ది లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును అని బైబిల్ చెబుతుంది. ఎవరైనా నిందిస్తే దావీదు రాజు వలె విడిచి పెట్టండి. దానిని గుర్తు చేసుకొని కృంగిపోకండి. వారికొరకు ప్రార్ధించండి. మీ కుటుంబమునకు చెందిన వారైతే గొడవపడిన రోజున వాళ్ళను ప్రేమించి క్షమించండి. దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన రోజును అనుభవించండి. 

- బ్రదర్. శామ్యూల్ గారు.

 

ప్రార్థన అంశం:-

నంబికై టి.వి ఛానల్లో కాంతివంతమైన కార్యక్రమాలను చూస్తున్న అనేకులు దేవుని ప్రేమను ఎరుగుటట్లు ప్రార్థిద్దం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet